
TIRUMALA || తిరుమలలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
తిరుమలలో స్వచ్ఛాంధ్ర (Swachh Andhra) కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం తిరుమలలో సామూహిక శ్రమదానాన్ని టీటీడీ (TTD)నిర్వహించారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి (Ch Venkaiah Chowdary)ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రం చేశారు.
అలిపిరి నడక దారిలోని కుంకాల పాయింట్ ఆఖరి మెట్టు వద్ద నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
Next Story