బ్రహ్మోత్సవాల్లో నేడు సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు
శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు ఉత్సవాల ప్రత్యేకతలు.
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అక్టోబరు 10వ తేదీ ఏడో రోజున గురువారం ఉదయం సూర్య ప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడిని తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించే ఊరేగింపులో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. ఇదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపనున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు సూర్యప్రభ వాహనసేవ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు ఏడుకొండలవాడు గురువారం సూర్యచంద్రులే నేత్రాలుగా భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగడం ద్వారా సూర్యచంద్రులు వెంకటేశ్వరునికి రెండు నేత్రాల వంటివని నిరూపించడమే ఈ అవతారం పరమార్థం. చంద్రుడు మనకారకుడు, ఔసధాలను తేజోవంతం చేసే శక్తి కలవాడు. అందుకే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకునేందుకు మానసిక ప్రశాంతత కలుగుతుందని భక్తుల నమ్మకం. సమస్త ఔషధీ తత్వంతో రోగ నాశనం జరుగుతుందని విశ్వసిస్తారు. చంద్రప్రభ వాహనంపై ఊరేగే వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగి, సమస్త సంపదలు సమకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
బుధవారం ఉదయం శ్రీములప్పస్వామి శ్రీ కోదండ రాముని అవతారంలో దనస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగుతూ వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. బంగారు తేరులో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామిని చూసి భక్తులు పరవశులయ్యారు. శ్రీనివాసుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన స్వర్ణరథంపై సాయంత్రం ఊరేగితూ భక్తులకు దర్శనమిచ్చారు. గజ వాహనంపై రాత్రి వేళల్లో అభయ ప్రధానం చేశారు. తన సార్వభౌమత్వాన్ని తెలిపేందుకు శ్రీవారు గజ వాహనంపై ఊరేగారు. తొలిసారిగా సెంటు జాజుల మాలను వినియోగించారు. పెద్ద జీయర్, చిన్నజీయర్, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విశాల్‌మిశ్రా, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా బుధవారం సాంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులకు 18 గంటల్లో శ్రీవారి దర్శనం, రూ. 300 టికెట్లు కలిగిన వారికి మూడు గంటలు సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. మంగళవారం 82,043 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రూ. 4.10 కోట్లు హుండీ ద్వారా కానుకలు లభించాయి.
Next Story