సమంతకు ‘సారీ’ చెప్పిన సురేఖ
x

సమంతకు ‘సారీ’ చెప్పిన సురేఖ

తనకు జరిగిన అవమానం మరొకరికి జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే తాను సమంత విషయానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు.


మొత్తానికి మంత్రి కొండా సురేఖ సినీనటి సమంతకు క్షమాపణ చెప్పారు. సమంత మీద చేసిన వ్యాఖ్యలు తాను అనుకోకుండా చేసినట్లు మంత్రి వివరించారు. తనకు జరిగిన అవమానం మరొకరికి జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే తాను సమంత విషయానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. తానుచేసిన ఆరోపణలపై సమంత చేసిన ట్వీట్ చూశానన్నారు. సమంత చేసిన ట్వీట్ ను చూసి తాను చాలా బాధపడినట్లు చెప్పారు. అందుకనే తాను బాధపడి సమంతకు క్షమాపణలు చెబుతు సమంతకు ట్వీట్ చేశానని చెప్పారు. సమంతకు వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలను భేషరతుగా వెనక్కు తీసుకుంటునట్లు చెప్పారు. అయితే కేటీఆర్ మీద చేసిన ఆరోపణల్లో వెనక్కు తగ్గేదేలేదన్నారు.

కేటీఆర్ తనకు జారీచేసిన లీగల్ నోటీసులను తాను కూడా లీగల్ గాను ఎదుర్కొంటానని స్పష్టంచేశారు. కేటీఆర్ వ్యవహారం దొంగే దొంగ దొంగ అని అరచినట్లుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సమంతను సురేఖ పూర్తిగా రోడ్డుమీదకు లాగేశారు. సమంత మీద ఉద్దేశ్యపూర్వకంగానే మంత్రి వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్-సమంత-నాగచైతన్య వ్యవహారాన్ని మంత్రి కావాలనే మీడియా ముందు బహిర్గత పరిచినట్లు అర్ధమైపోతోంది. ‘తానుచేసిన వ్యాఖ్యల పట్ల సమంత బాధపడితే’ అని మంత్రి చెప్పటంలో అర్ధంలేదు. సమంత మీద మంత్రి చేసింది వ్యఖ్యలు కావు. వ్యాఖ్యలని మంత్రి సమర్ధించుకోవచ్చు కానీ చేసింది తీవ్రమైన ఆరోపణలు.

తాను బాధపడ్డాను కాబట్టి వేరొకరు బాధపడకూడదని మంత్రి చెప్పటం కూడా అబద్ధమే. కేటీఆర్ తో మంత్రికి ఏదైనా సమస్యుంటే అది రాజకీయంగా తేల్చుకోవాలి కాని మధ్యలో సమంత, నాగచైతన్య, నాగార్జునను పిక్చర్లోకి లాగాల్సిన అవసరం ఏముంది ? ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపమని నాగార్జునను కేటీఆర్ అడిగారని చెప్పటం మామూలు ఆరోపణలు కాదు. నాగార్జున, చైతన్య క్యారెక్టర్ను మంత్రి ఘోరంగా రోడ్డుమీదకు లాగేశారు. కేటీఆర్ దగ్గరకు వెళ్ళాలని సమంతను నాగార్జున, చైతన్య ఒత్తిడి చేశారంటే వీళ్ళిద్దరి క్యారెక్టర్లను మంత్రి రోడ్డుమీద పడేసినట్లే. ఇదే సమయంలో ఒత్తిడికి అంగీకరించలేదని మంత్రి చెప్పటంతో సమంత సేవ్ అయినట్లే అనుకోవాలి. కాని విడాకులకు కారణం మాత్రం సమంత కేటీఆర్ దగ్గరకు వెళ్ళకపోవటమే అన్న ఆరోపణ మాత్రం సమంతను కూడా బాగా ఇబ్బంది పెట్టేదే అనటంలో సందేహంలేదు.

వైరం ఎందుకని అనుకున్నారో ఏమో మంత్రి వెంటనే సమంతకు సారి చెబుతు ట్వీట్ చేశారు. మరి నాగార్జున, చైతన్య గురించి మంత్రి ఏమీ చెప్పలేదు. కాబట్టి తండ్రి, కొడుకులను మంత్ర పట్టించుకున్నట్లు లేదు. మరీ వివాదం చివరకు ఎంతదాకా వెళుతుందో చూడాలి.

Read More
Next Story