
చెవిరెడ్డి బెయిల్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించడంతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటీషన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సుప్రీం కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేసుకున్నారు. ఈ పిటీషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు చెవిరెడ్డి బెయిల్‌కు సంబంధించి క్లారిటీ ఇచ్చింది.
ఏపి లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన నిందితులతో ఎలాంటి సంబంధం లేకుండా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్ పై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇది వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆశ్రయించారు. ఆ మేరకు పిటీషన్‌ను దాఖలు చేశారు. దీనిపైన విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇదే మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి బెయిల్‌పై తుది నిర్ణయం తీసుకునేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న తక్కిన నిందితుల బెయిల్ పిటీషన్‌లపై నిర్ణయం తీసుకోవద్దని ట్రయల్ కోర్టును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇది వరకు ఆదేశాలు జారీ చేసింది. దీనిని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. దీనిపైన సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. విచారించి నిర్ణయం తీసుకోవలని ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
Next Story