బెయిలిస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్టవుతుంది
x

బెయిలిస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్టవుతుంది

లిక్కర్‌ స్కామ్‌లో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు సుప్రీం కోర్టు బెయిల్‌ నిరాకరించింది.


ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాలు సృష్టిస్తోన్న లిక్కర్‌ స్కామ్‌కు సంబందించి మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్‌ అధికారి, మాజీ సీఎం జగన్‌ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డిలకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. లిక్కర్‌ కేసులో తమకు ముందసు బెయిల్‌ మంజూరు చేయాలని దరఖాస్తులు చేసుకున్న పిటీషన్‌ల మీద శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు వారిద్దరికి బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. లిక్కర్‌ కేసు దర్యాప్తు చాలా కీలక దశలో ఉన్నందువల్ల వీరిద్దరికి ముందస్తు బెయిల్‌ ఇవ్వడం కుదరదని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు దాఖలు చేసుకున్న పిటీషన్‌లను కొట్టేసింది.

దనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు చేస్తోన్న విచారణ అధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని.. ఈ నేపథ్యంలో దనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయలేమని «సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మద్యం కుంభకోణం కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు తొలుత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నికరించడంతో వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ పార్థీవాల, జస్టిస్ మహదేవన్ (ustice JB Pardiwala and R. మహదేవన్) ధర్మాసనం ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ను కొట్టేసింది. కృష్ణమోహన్ రెడ్డి తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వి వాదిస్తే, ధనంజయ్ రెడ్డి తరఫున సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ హాజరయ్యారు. ఇక బాలాజీ గోవిందప్ప తరఫున మరొక సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ దవే వాదించారు.

ఇదే కేసులో ఇది వరకు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు శుక్రవారం వరకు అరెస్టు చేయొద్దని సిట్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు హాజరు కావాలని, దర్యాప్తునకు సహకరించాలని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ మేరకు సిట్‌ అధికారుల విచారణకు వీరు హాజరయ్యారు. సుప్రీం కోర్టు నిర్ణయంతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ముందస్తు బెయిల్‌ మీద ఆశలు పోయాయి. ఒక పక్క సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు శుక్రవారంతో పూర్తి కానుండటం, మరో వైపు ముందస్తు బెయిల్‌ మంజూరు కాకపోవడంతో ధనుంజయరెడ్డి, కృష్ణబమోహన్‌రెడ్డిల అరెస్టు తప్పదనే టాక్‌ వినిపిస్తోంది.
Read More
Next Story