గ్రామ సచివాలయంలోనే భూముల రిజిస్ట్రేషన్
x

గ్రామ సచివాలయంలోనే భూముల రిజిస్ట్రేషన్

వారసత్వ భూముల సక్సెషన్ రిజిస్ట్రేషన్లు రూ.100 కే ఇక ఉన్న ఊళ్లోనే అందుబాటులోకి రానున్నాయి


ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో గుడ్ న్యూస్ అందించింది.వారసత్వ భూముల సక్సెషన్ రిజిస్ట్రేషన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో నామమాత్ర పీజుతో ఈ రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.కేవలం వంద రూపాయలకే గ్రామ సచివాలయం లోనే ఆ భూముల రిజిస్ట్రేషన్ చేయడానికి వడివడిగా చర్యలు చేపడుతోంది.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ రూ.10 లక్షల లోపు ఉంటే రూ. 100, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.1000 ఫీజును స్టాంపు డ్యూటీ కింద తీసుకోనున్నారు.

ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. వారసత్వంగా వచ్చే ఆస్తులను వారసులు,తహసీల్దారుకు దరఖాస్తు చేసి, కాగితాలపై రాసుకుంటున్నారు. అయితే వీటికి మ్యుటేషన్లు జరగడం లేదని,తహసీల్దారు కార్యాలయ సిబ్బంది పలుమార్లు తిప్పుతున్నారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.ఈ ఫిర్యాదుల నేపధ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఎక్కువ శాతం తమ వారు చనిపోయాక కూడా వారసత్వ పేరు మార్చుకోకుండా జాప్యం చేస్తుండటంతో భూముల రికార్డులలో చనిపోయిన వారి పేర్లే వస్తున్నాయి.దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. గత ఏడాదిలోనే 55 వేలకు పైగా ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ప్రభుత్వం ప్రస్తుత నిర్ణయంతో వారసత్వ భుముల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రజలకు ఎంతో ఊరట దక్కనుంది.
Read More
Next Story