
భూములు పోయిన ఆంధ్రా రైతులకు అండగా ఈ పెద్దాయన కమిటీ
దీని కోసం ప్రత్యేక మిటీని ఏర్పాటు చేసినట్లు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ నిర్వాసితుల పక్షాన నిలబడి, వారికి అండగా ఉండి, న్యాయ సలహాలు అందించి పోరాటాలు సాగించాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి నిర్ణయించింది. ఆ మేరకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ నిర్వాసితులకు అండగా న్యాయ సలహాలు అందించడానికి, న్యాయపోరాటం చేయడానికి సుంకర రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ప్రముఖ న్యాయవాదులతో న్యాయ సలహా కమిటీని ఏర్పాటు చేశారు.
భూనిర్వాసితుల సంరక్షణ పోరాట కమిటీకి వడ్డే శోభనాద్రీశ్వరరావునాయకత్వం వహింస్తారు. రైతు సంఘాల రాష్ట్ర నాయకులు యం.వి. కృష్ణయ్య, పి. జమలయ్య, పౌర సంస్థల నేతలు వి. లక్ష్మణరెడ్డి, సింహాద్రి ఝాన్సీ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, డి. హరినాథ్, కొల్లా రాజమోహన్, ఎమ్మెల్సీ రఘురాజు, కొరివి వినయ్ కుమార్, వి.వెంకటేశ్వర్లు, కె.యం.ఎ.సుభాష్, మిరియం శ్రీనివాసులు, మరీదు ప్రసాద్ బాబు,రమణ రెడ్డి, వసుంధర, మజ్జి చిన్న, కూనం రాము తదితరులు కమిటీలో ఉంటారు.
ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఈనెల 3వ తేదీ విజయవాడలోని కేఎల్ రావు భవన్ లో జరిగిన రాష్ట్ర సదస్సులో విచక్షణా రహితంగా భూసేకరణజరపడాన్ని సమితి వ్యతిరేకించింది. ఈ సందర్భంగా సమితి చేసిన అనేక తీర్మానాలను మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాకు విడుదల చేశారు.