
యాక్టర్ విజయ్ కరూర్ మీటింగ్ లో తొక్కిసలాట..31 మంది మృతి
టీవీకే పార్టీ కరూర్ లో నిర్వహించిన మీటింగ్ లో విజయ్ ప్రసంగిస్తుండగా తొక్కిసలాట జరిగింది.
తమిళనాడు కరూర్‌లో ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది.. భారీగా జనం తరలిరావడంతో తొపులాట జరిగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో 31 మంది మృతి చెందినట్లు తమిళనాడు ఆరోగ్యశాఖామంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. విజయ్ ర్యాలీలో దాదాపు ౫౦ మందికిపైగా స్పృహ కోల్పోయినట్లు తెలుస్తున్నది. దాంతో వారిని వెంటనే కరూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలోనే రెండు అంబులెన్స్‌లు వచ్చి బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారికి సహాయం అందించాలని.. అంబులెన్స్‌కు దారి ఇచ్చేలా చూడాలని తన అభిమానులకు సూచించాడు. ఈ ఘటన నేపథ్యంలో విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశాడు. సమాచారం అందుకున్న తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ ఆసుపత్రికి సందర్శించారు. ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు.
Next Story