28న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం
x
అమరావతి సమీపంలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీ

28న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం

ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.


ఏపీ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. మంగళవారం ఉదయ 11 గంటలకు యూనివర్శిటీ ఆడిటోరియంలో విద్యార్థులకు డిగ్రీల ప్రదానం జరుగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు యూనివర్సిటీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.


యూనివర్సిటీలో 2020-25 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ చదివిన 1877 మంది విద్యార్థులకు, మరో 39 మంది పరిశోధనా విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. ఇందులో 45 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు, 7 నుంది స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులకు, నలుగురు లిబరల్ ఆర్ట్స్ విద్యార్థులకు ఈ సందర్భంగా బంగారు, వెండి పతకాలను ప్రదానం చేయనున్నారు.
స్నాతకోత్సవం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటలకు ముగియనుంది. సోమవారం ఉదయం యూనివర్సిటీ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ ఆచార్య సీహెచ్ సతీష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ప్రేమ్ కుమార్లు ఆడిటోరియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ వర్గాల నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తో పాటు యూనివర్సిటీ కులపతి డాక్టర్ టీఆర్ పారివేంధర్, ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణన్, ఇన్ చార్జి వైస్ చాన్సలర్ డాక్టర్ సతీష్ కుమార్, గవర్నింగ్ బాడీ మెండర్లు పాల్గొంటారు.


Read More
Next Story