260 కోట్లతో శ్రీవారి విస్తరణ పనులు
x

260 కోట్లతో శ్రీవారి విస్తరణ పనులు

రాజధాని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.


అమరావతి రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గురువారం శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొల్లు రవీంద్ర, నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, తెనాలి శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, పలువురు శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

మొత్తం రూ.260 కోట్ల వ్యయంతో రెండు దశల్లో ఈ విస్తరణ పనులు చేపట్టనున్నారు. మొదటి దశలో రూ.140 కోట్లతో ప్రధాన విస్తరణ పనులు చేపట్టనున్నారు. మొదటి దశలో రూ.92 కోట్లతో ఆలయ చుట్టూ భారీ ప్రాకారం నిర్మిస్తారు. మరో రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్‌లు నిర్మించనున్నారు. రెండో దశలో రూ.120 కోట్లతో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికుల విశ్రాంతి భవనం, అర్చకులు-సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Read More
Next Story