
చిన్నారి మెడకు చున్నీ బిగించి చంపేశాడు
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని చిన్నారి రంజిత (10) అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. నవంబర్ 4న ఫ్యాన్‌కు వేలాడుతూ మృతదేహం కనిపించిన ఈ ఘటన హత్యగా నిర్ధారణ అయింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు శ్రీనివాస్ (శ్రీను)ను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ రాహుల్ మీనా మీడియాకు వెల్లడించిన వివరాలు ప్రకారం..నిందితుడు శ్రీనివాస్ బాధితురాలి ఇంటి కింద ఉన్న ఇంటర్నెట్/జిరాక్స్ షాప్ యజమాని కోటి స్నేహితుడు. రెగ్యులర్‌గా షాప్‌కు వచ్చేవాడు. ఆర్థిక సమస్యలు (చెల్లి పెళ్లి కోసం డబ్బు కష్టాలు)తో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. చిన్నారి రంజిత తల్లి సునీత ఇంట్లో లేని సమయంలో కావాల్సిన వస్తువులు ఇవ్వమని శ్రీనుకు చెప్పేది. గతంలోనూ ఇంటికి వచ్చేవాడు. తల్లి సునీత చెప్పిన విధంగా వస్తువులు ఇంట్లో ఇచ్చావాడు.
అయితే నవంబర్ 4 సాయంత్రం 4:30 గంటలకు రంజిత స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. 5 గంటలకు శ్రీను ఫ్యాన్ రిపేర్ అయింది అని ఇంట్లోకి వెళ్లాడు. చోరీ చేయాలని ప్లాన్ తో ఇంట్లోకి వెళ్లాడు. బెడ్‌రూమ్‌లో విలువైన వస్తువులు ఉన్నాయి. కాబట్టి బెడ్ రూమ్ లో ఫ్యాన్ రిపేరు ఉందని చెప్పాడు. అయితే అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చిన శ్రీనుని చూసి ఇంట్లోకి ఎందుకు వచ్చావు?" అని రంజిత ప్రశ్నించి, తల్లికి చెప్పాలని ప్రయత్నించింది. దొంగతనం చేయాలనే ఆలోచనల్లో ఉన్న శ్రీను ఆ విషయాన్ని తల్లి సునీతకు చెప్పేస్తుందేమో అని భావించిన శ్రీను క్రూరంగా మారాడు. చిన్నారి మెడకు చున్నీ బిగించి హత్య చేసి ఫ్యాన్‌కు వేలాడదీశాడు. అనుమానం రాకుండా ఆత్మహత్యలా కనికట్టు కథ అల్లాడు.
అయితే ఘటనాస్థలంలో నిందితుడి ఫింగర్ ప్రింట్లు దొరికాయి. సీడీఆర్, సీసీటీవీ ఫుటేజ్‌లో లొకేషన్ అదే ప్రాంతంలో ఉన్నట్లు తేలింది. దీంతో శ్రీనుని అదుపులోకి తీసుుని విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మెడికల్ రిపోర్టు, సాంకేతిక ఆధారాలు ఇంకా రావాల్సి ఉంది. నిందితుడిని కోర్టుకు హాజరుపర్చి రిమాండ్‌కు పంపనున్నారు. మరో వైపు ఈ దారుణ హత్య "చిట్టితల్లీ.. ఏం కష్టమొచ్చిందమ్మా!" అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలల భద్రతపై మరింత అప్రమత్తత అవసరమని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

