హాస్టల్లోకి వెళ్లి విద్యార్థినిపై లైంగికదాడి
x

హాస్టల్లోకి వెళ్లి విద్యార్థినిపై లైంగికదాడి

దుండగుల దారుణానికి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న ఆ యువతిని రిమ్స్‌కు తరలించారు.


కామంతో కళ్లు మూసుకొని పోయిన కామాంధులు అక్రమంగా లేడీస్‌ హాస్టల్‌లోకి వెళ్లి డిగ్రీ ఆఖరు సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అందరూ ఉండగానే దుండగులు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణమైన దుర్ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.

శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహంలోకి గుర్తు తెలియని దుండగలు గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్రమంగా ప్రవేశించారు. ఇదే అదునుగా భావించిన ఆ దుండగులు బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న ఓ హస్టల్‌ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. హాస్టల్‌ ప్రాంగణంలోనే దుర్మార్గులు ఈ దారుణానికి ఒడి గట్టారు. వసతి గృహంలో అందరూ ఉండగానే ఆ యువతిపై యధేచ్చగా దారుణానికి పాల్పడిన ఆ దుండగులు తర్వాత అక్కడ నంచి పరారయ్యారు.
దుండగుల దారుణానికి తీవ్రంగా గాయపడిన ఆ యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. దీనిని గమనించిన తోటి విద్యార్థినులు హాస్టల్‌ సిబ్బందికి, వార్డన్‌కు సమాచారం అందించారు. తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతున్న ఆ విద్యార్థినిని హుటాహుటిన రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. దీంతో ఆసుపత్రి వద్దకు చేరుకున్న ఆ యువతి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ సంఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్మార్గుల వేటకు రంగంలోకి దిగారు. నిందితుల కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. లేడీస్‌ హాస్టల్‌ భవనంలోకి ప్రవేశించిన దుండగులు ఎవరు, ఎలా హాస్టల్‌లోకి ప్రవేశించారు, హాస్టల్‌లో నుంచి వారికి ఎవరైన సహాపడ్డారా? ఎంత మంది ప్రవేశించారు అనే అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో వైపు ఈ సంఘటనతో వసతి గృహంలోని విద్యార్థినులు హడలి పోతున్నారు. ఇలాంటి ఘటనలతో తామెలా ఈ హాస్టల్లో ఉంటూ చదువుకోవాలని భయాందోళనలకు గురవుతున్నారు.
Read More
Next Story