మెగా డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా
x

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా

క్రీడాకారుల నుంచి డీఎస్సీ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది.


ఆంధ్రప్రదేశ్‌లోని క్రీడాకార్లుకు కూటమి ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన మెగా డిఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా కింద 421 ప్రభుత్వ పాఠశాలల ఉద్యోగాలకు దరఖాస్తులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అందులో భాగంగా మండల షరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్‌ కార్పొరేషన్, ఏపీ మోడల్‌ స్కూల్స్, ఏపీ గురుకుల పాఠశాలలు, సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలు, గిరిజన గురుకుల పాఠశాలల విద్యా సంస్థలలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీని కోసం అర్హత కలిగిన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అమరావతి నిర్మాణాల పనులు పునఃప్రారంభం సందర్భంగా మే 2 శుక్రవారం నుంచి వెబ్‌సైట్‌ను ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు ప్రారంభించారు. శుక్రవారం నుంచి మే 31 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం గడువును విధించింది.

మే 2 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి క్రీడాకారులు తమ దరఖాస్తులను వెబ్‌సైట్‌ ద్వారా చేసుకునేందుకు వీలు కల్పించారు. sports.ap.gov.in / sports dsc.apcfss.in

వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు సౌకర్యం కల్పించింది. సీనియర్‌ క్రీడా విభాగంలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. జిల్లా స్థాయి స్క్రీనింగ్‌ కమిటీ, రాష్ట్ర స్థాయి ఫైనల్‌ కమిటీల ద్వారా తుది బాజితాలకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులకు రాత పరీక్షలు లేకుండా 3 శాతం హారిజాంటల్‌ రిజర్వేషన్‌ను కూటమి ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని శాప్‌ చైర్మన్‌ రవినాయుడు తెలిపారు.

Read More
Next Story