
మీడియేషన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
‘ఈజ్ ఆఫ్ జస్టిస్’తోనే సత్వర న్యాయం!
విశాఖలో శుక్రవారం జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు.
ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయన్నారు. శుక్రవారం విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన ఆయన ఏమన్నారంటే?

న్యాయమూర్తులు, న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి
‘ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా న్యాయం అందరికీ అందుబాటులోకి రావడంతోపాటు వేగంగా, సమర్థవంతంగా చేరుతుంది. మీడియేషన్ అంశం భారత్‌కు కొత్త కాదు. తరతరాలుగా మనకు అందుబాటులో ఉంది. పురాణాల్లో శ్రీకృష్ణుడు ఓ సమర్థవంతమైన మీడియేటర్‌గా వ్యవహరించాడు. గతంలో మన పూర్వీకులు, గ్రామపెద్దలు సమర్థవంతంగా మీడియేషన్ ప్రక్రియను నిర్వహించేవారు. విశాఖపట్నంలో జ్యుడిషియల్, మధ్యవర్తిత్వ రంగాలపై చాతిత్రాత్మక కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం చంతోషదాయకం. ప్రజాస్వామ్యంలో భారతీయ న్యాయ వ్వవస్థ ఓ మూల స్తంభం. రాజ్యాంగపరమైన హక్కుల్ని, చట్టాలను కాపాడే అత్యంత కీలకమైన వ్యవస్థ. నిబద్ధతకు, నిష్పాక్షికతకు, పారదర్శకతకు పెట్టింది పేరు. కొన్ని సమయాల్లో కాస్త ఆలస్యమైనా న్యాయం దక్కుతుందనే నమ్మకం ప్రతి పౌరుడికీ ఉంది. భారత్ అత్యంత వేగంగా సంస్కరణలను అమలు చేస్తోంది.’

కాన్ఫరెన్స్‌కు హాజరైన న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు
ఏపీకి వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు..
‘ఆంధ్రప్రదేశ్‌కు గత ఏడాది కాలంగా వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. కంపెనీలు, వ్యవస్థలు వస్తునన నేపథ్యంలో వివాదాల పరిష్కారానికి మీడియేషన్ లాంటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలు అందుబాటులోకి రావాలి. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టం రావాల్సిన అవసరం ఉంది. సులభంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.’
వైజాగ్‌లో ఏడీఆర్ ఎకో సిస్టం..
విశాఖపట్నంలో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎకో సిస్టం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పెరిగిపోతున్న వివాదాలు, కేసుల పరిష్కారానికి కొత్తగా కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు మీడియేషన్, ఆర్బిట్రేషన్‌కు కొత్త వ్వవస్థలు అవసరమవుతాయి. ఇప్పటికీ చాలామంది ప్రజలు కేసులు దాఖలు చేసి కోర్టులకు వెళ్లడం అవమానంగా భావిస్తారు. దీనికి మీడియేషన్ ప్రక్రియ చక్కని పరిష్కారం. దేశం అమలు చేస్తున్న సంస్కరణలు, కొత్త వ్యవస్థలు అందుబాఉటలోకి వస్తున్న నేపథ్యంలో వివాదాలు తగ్గించుకోవడమ ఆర్థిక వ్యవస్థకు కీలకం. దానికనుగుణంగా వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలను రూపొందించుకోవాల్సి ఉంది. ఈజ్ ఆఫ్ జస్టిస్ ప్రక్రియలో భాగంగా వర్చువల్ హియరింగ్స్, ఈ–ఫైలింగ్, మొబైల్ అప్‌డేట్స్ వంటి సాంకేతికతను అమలు చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సుపీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పీఎస్ నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు.
Next Story