'ఆంధ్రా ఊటి' అరకు యాత్రకు 28 నుంచి ప్రత్యేక రైళ్లు
ఆంధ్రా ఊటి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 28 నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనుంది
క్రిస్టమస్, కొత్త సంవత్సరం.. వరుస సెలవులు.. ఏదైనా టూర్‌కి వెళ్లాలని ప్రతి ఒక్కరూ ప్లాన్ చేస్తుంటారు. తమ బడ్జెట్ కి తగ్గట్టుగా నచ్చిన ప్రాంతాలను చూసిరావాలనుకుంటుంటారు. మరి మీరు కూడా ఇలానే అనుకుంటుంటే మీకో గుడ్ న్యూస్. విశాఖపట్నం నుంచి అరకు లోయ అందాలను చూసేవాళ్ల కోసం తూర్పు కోస్తా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
అరకు పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తూర్పు కోస్తా రైల్వే విశాఖ నుంచి ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ చెప్పారు. డిసెంబర్ నెల 28 నుంచి జనవరి 19వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలు దేరి ఉదయం 11.45 గంటలకు అరకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజుల్లో మధ్యాహ్నం 2 గంటలకు బయలు దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకోనున్నట్లు పేర్కొన్నారు. ఒక సెకెండ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ, 10 స్లీపర్ క్లాస్, 4 సాధారణ రెండో తరగతి, 2 సాధారణ కమ్ లగేజీ బోగీలతో ఈ రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రా గుహలు మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.
అరకుతో పాటు విశాఖపట్నం అందాలనూ ఆస్వాదించవచ్చు. అరకు లోయ జలపాతాలు, ప్రవాహాలు, కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. దీన్నే "ఆంధ్రా ఊటీ" అని కూడా అంటుంటారు.
విశాఖపట్నానికి మరో పేరు పోర్ట్ సిటీ. 4వ శతాబ్దంలో ఆంధ్ర రాజులు నిర్మించిన విశాఖ దేవుని మందిరం నుంచి ఈ పేరు పుట్టింది. ఇది పురాతన నౌకాశ్రయం. భారత దేశ తూర్పు తీరంలో ఉన్న ఏకైక నాచురల్ పోర్ట్. దీనిని తరచూ ది జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్, ది సిటీ ఆఫ్ డెస్టినీ, గోవా ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్ అని పిలుస్తారు. విశాఖపట్నం భారతదేశంలో ఐదవ పరిశుభ్రమైన నగరం. విశాఖపట్నంలో అనేక బీచ్ లు కూడా
Next Story