
సింగపూర్‌లో ‘సీబీఎన్ బ్రాండ్’కు ప్రత్యేక గుర్తింపు
సీఎం చంద్రబాబు బృందానికి సింగపూర్‌లో ఘనస్వాగతం పలికారు.
ఇండియాతో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని, ప్రత్యేకించి ఏపిలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని,సింగపూర్ ప్రభుత్వంలో, స్థానిక పారిశ్రామిక వర్గాల్లో సీబీఎన్ బ్రాండ్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులే సీఎం చంద్రబాబుకు వివరించారు. ౖ భారత హైకమీషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రులు పి.నారాయణ, నారా లోకేష్, టిజి భరత్, అధికారులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో సింగపూర్ ప్రగతి, గ్రోత్ రేట్, ప్రభుత్వ పాలసీలు, సింగపూర్‌లో భారతీయుల కార్యకలాపాలను భారత్ హై కమిషనర్ శిల్పక్ అంబులే వివరించారు.
ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్,ఏవియేషన్, సెమి కండక్టర్స్,పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను కూడా వివరించారు. గతంలో సింగపూర్ తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలు, పెట్టబడులకు గల అవకాశాలను సీఎం వివరించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్లు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నట్లు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఏపిలో ఇప్పటికే పట్టాలెక్కాయని, ఇండియా క్వాంట్వం మిషన్ లో క్వాటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు అవుతుందని సీఎం చంద్రబాబు వివరించారు. డిఫెన్స్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమోబైల్ సంస్థలకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఇండియాకు సింగపూర్ నుంచి పెట్టుబడులు రావాలి...వాటికి ఏపీ గేట్ వేగా ఉంటుంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
సింగపూర్ లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ అని హై కమిషనర్ వివరించారు. విద్యా రంగంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, తమ ఆలోచనలను మంత్రి లోకేష్ వివరించారు. అంతకుముందు సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు, ఏపీఎన్‌ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణలో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు తరలి వచ్చి హారతులు పట్టారు.