ఇండియా–పాకిస్తాన్‌ వార్‌కు మద్దతుగా ప్రత్యేక పూజలు
x

ఇండియా–పాకిస్తాన్‌ వార్‌కు మద్దతుగా ప్రత్యేక పూజలు

జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మరో సారి ప్రత్యేక పూజల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇండియా–పాకిస్తాన్‌ యుద్ధం నెలకొన్న నేపథ్యంలో జనసేన పార్టీ శ్రేణుల చేత ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆ మేరకు కార్యక్రమాల వివరాలను శుక్రవారం వెల్లడించారు.

ఆయన ఏమన్నారంటే ..
‘ఆపరేషన్‌ సింధూర్‌.. పాకిస్తాన్‌ మీద చేస్తున్న ధర్మ యుద్ధానికి మనందరి నైతిక మద్దతు అవసరం. శత్రు మూలకపై పోరాడే శక్తి సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిద దళాలకు మెండుగా ఉన్నాయి. ఆ పోరాటంలో ఉన్న సైనికులకు, దేశానికి నాయకత్తం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భగవంతుడి ఆశీస్సులు, దైవ బలం మెండుగా ఉండాలని ప్రార్థించడం మన బాధ్యత’ అంటూ పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.
మంగళవారం ఉదయమే పూజలు
అందులో భాగంగా తమిళనాడులోని షష్ట షణ్ముఖ క్ష్రేతాలకు, కర్ణాటకలోని రెండు, ఆంధ్రప్రదేశ్‌లోని రెండు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో మంగళవారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి, దేశ సైన్యానికి దైవ బలం తోడుండాలని ప్రార్థించాలి. యుద్ధ ప్రభావం ఉన్న జమ్ము, కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హరియాన రాష్ట్రాల ప్రజల క్షేమాన్ని కోరుకోవాలి. క్షేత్రంలో పూజాదికాల బాధ్యత తీసుకున్న శాసన సభ్యులు,తమ వెంట కనీసం 100 మంది జనసైనికులను తీసుకెళ్లాలి. ఈ యాత్ర సద్దుద్దేశాన్ని ప్రజలకు, పార్టీ శ్రేణులకు తెలియజేయాలి. ఆలయం వెలుపలకు వచ్చి, కర్పూరం వెలిగించి వెట్రివేల్‌ మురుగన్‌కి హరోమ్‌ హర అని భక్తి పూర్వకంగా నినదించాలి. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఊపి భారత్‌ మాతాకి జై అని నినదించాలి అని దిశా నిర్థేశం చేశారు.
షష్ట క్షేత్రాల దర్శనం కోసం వెళ్లే శాసన సభ్యులు
తిరుత్తణికి ఆరణి శ్రీనివాసులు, తిరుచెందూరుకు పి ధర్మరాజు, పళనికి పంతం నానాజీ, పలముదిరవోళైకి అవర శ్రీధర్‌లు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని కుక్క క్షేత్రానికి టీపీ వరుణ్, అదే రాష్ట్రంలోని ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రానికి బత్తుల బలరామకృష్ణ, మోపిదేవికి మండలి బుద్ద ప్రసాద్, బిక్కవోలుకు కందుల దుర్గేష్, విజయవాడ ఇంద్రకీలాద్రికి నాదెండ్ల మనోహర్, పీ హరిప్రసాద్, అరసవల్లికి నిమ్మక జయకృష్ణ, పిఠాపురంలోని శక్తి పీఠానికి తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాస్‌లు వెళ్లాలని నిర్ణయించారు.
Read More
Next Story