టీటీడీలో సెప్టెంబర్‌ నెలలోని విశేష పర్వదినాలు
x

టీటీడీలో సెప్టెంబర్‌ నెలలోని విశేష పర్వదినాలు

తిరుమల తిరుపతిలో ప్రతి నెలా ఎన్నో విశేష పర్వదినాలు జరుగుతుంటాయి. ప్రతి పర్వదినం కూడా విశేష స్పందన అందుకుంటుంది.


తిరుమల తిరుపతిలో ప్రతి నెలా ఎన్నో విశేష పర్వదినాలు జరుగుతుంటాయి. ప్రతి పర్వదినం కూడా విశేష స్పందన అందుకుంటుంది. ఈ పర్వదినాల్లో పాల్గొనడానికి భక్తులు కూడా ఎంతో ఆసక్తి చూపుతారు. ఈ పర్వదినాల్లో కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా సాధారణం కంటే అధికంగా ఉంటుంది. ఈ ఏడాది ఒకే ఒకసారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నెలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు ఏంటనేది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలోని విశేష పర్వదినాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇంతకీ సెప్టెంబర్ నెలలోని విశేష పర్వదినాలు ఎలా ఉన్నాయంటే..

- సెప్టెంబరు 5న బలరామ జయంతి, వరాహ జయంతి.

- సెప్టెంబరు 7న వినాయక చవితి.

- సెప్టెంబరు 17న అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం.

- సెప్టెంబరు 18న పౌర్ణమి శ్రీవారి గరుడసేవ.

- సెప్టెంబరు 28న సర్వ ఏకాదశి.

Read More
Next Story