
నేడు ఏపీలోకి ‘నైరుతి’ ఎంట్రీ
చాలా ఏళ్ల తర్వాత సాధారణం కంటే ఎనిమిది రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి.
యావత్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఇవి కేరళను తాకాయి. చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రాయలసీమ ప్రాంతాలకు సమీపించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలకు ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు వాటి నుంచి ఒక్క సారిగా ఉపశమనం పొందారు.
శుక్రవారం కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు శని, ఆదివారాల్లో కేరళతోపాటు గోవా ప్రాంతాల్లో పూర్తిగా వ్యాపించాయి. కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని తక్కిన ప్రాంతాలకు కూడా ఇవి విస్తరిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత అతి కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా విస్తరిస్తున్న నేపథ్యంలో జూన్ 2 వరకు మహారాష్ట్రతో పాటు తూర్పు తీర ప్రాంతాలకు వ్యాపించిన అనంతరం వాటి వేగం తగ్గి, విరామ స్థితిలోకి చేరుకుంటాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నైరుతి రుతుపవనాల వల్ల ఇప్పటికే మహారాష్ట్ర నుంచి ఒడిశా వరకు అరేబియా సముద్రంలో ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 1.5 నుంఇ 4.6కిమీ ఎత్తులో ఇది విస్తరించి ఉంది. ఇది మే 27 నాటికి అంటే మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనంగా మరే అవకాశాలు అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్రతోపాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ఉరుములతో కూడిన గాలులు వీచే అవకావాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Next Story