‘ఎప్పటికి మన గోదావరి మూలాలను మరవొద్దు’
x

‘ఎప్పటికి మన గోదావరి మూలాలను మరవొద్దు’

అమెరికా ఉపాధ్య అభ్యర్ధిగా జేడీ వాన్స్ ను ట్రంప్ ప్రకటించడంతో, ఆయన భార్య ఉషా చిలుకూరి మూలాలపై నేడు సర్వత్రా చర్చనీయాంశమైంది.


అమెరికాలోని రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ ను ట్రంప్ ప్రకటించడంతో ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు మీడియాలో మారుమోగిపోతోంది. ఉషా చిలుకూరి మూలాలు ఆంధ్ర ప్రదేశ్ లోని గోదావరి జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం వైజాగ్ లో నివాసం ఉంటున్న ఫిజిక్స్ ప్రొఫెసర్, 96 ఏళ్ల శాంతమ్మ దూరపు బంధువు కావడంతో మీడియా దృష్టి ఆమెపై పడింది. శాంతమ్మ ఎప్పుడు ఉషా చిలుకూరిని కలవలేదు, మాట్లాడలేదు. కానీ శాంతమ్మ మాత్రం ఉషా చిలుకూరి మాత్రం తన గోదావరి మూలాలను గుర్తుంచుకోవాలని కోరారు. సాధ్యమైన రీతిలో భారత్ కు సాయం చేయాలని పిలుపునిచ్చారు.

ఉష మూలాలు..

“నా భర్త (సి సుబ్రమణ్య శాస్త్రి) ద్వారా నాకు ఉషతో సంబంధం ఉంది. ఆమె ఐఐటీ ప్రొఫెసర్‌గా పనిచేసిన నా బావగారి మనవరాలు’’ అని శాంతమ్మ బుధవారం (జూలై 17) ఓ వార్తా ఛానెల్‌తో అన్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి పెద్ద సోదరుడు, సి రామశాస్త్రి, ఉష తాత. ఆమె తల్లిదండ్రులు, సి రాధాకృష్ణ- లక్ష్మి 1980లో US కి వలస వచ్చారు.

ఇప్పటికీ విజయనగరంలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా ఫిజిక్స్ బోధిస్తున్న శాంతమ్మ కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి సమీపంలోని వడ్డూరు గ్రామానికి చెందిన ఉష కుటుంబ మూలాలు ఉన్నాయి.

"చిప్ ఇన్ ఇండియా"

యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థికి జీవిత భాగస్వామిగా ఉష గుర్తింపు పొందడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఆమె స్వయంగా న్యాయవాది కావడంపై కూడా హర్షం వ్యక్తం చేసింది. "నేను ఆమెను(ఉషా) చాలా ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తున్నాను. ఆమెకు ఇప్పుడు చాలా గుర్తింపు పొంది ఉండవచ్చు. దీని వెనక అనేక సంవత్సరాల కృషి ఉంది’’ ఉంది అని ఉషా అత్త జేడీ ఉషా గురించి గొప్పగా వివరించారు.

ఉషా అనేక సందర్భాల్లో తన భర్త తనకు గొప్ప సహాయకారిగా ఉంటాడని చెప్పుకొచ్చిందని ఈ విషయాలను మీడియా లో వివరించడం చూసి సంతోషించానని అన్నారు. ఉషా ఎప్పుడు కూడా తన గోదావరి మూలాలను గుర్తు పెట్టుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మన దేశానికి సాధ్యమైనంత మేర సాయం చేయాలని కోరారు.

39 ఏళ్ల జేడీ వాన్స్ ను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, వాన్స్ డెమొక్రాటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను ఢీకొట్టబోతున్నారు.

Read More
Next Story