ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటా
సోనూసూద్ సినిమాల్లోనే విలన్..నిజ జీవితంలో రియల్ హీరో. ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటా అని మాటిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో మంది సినీ స్టార్లు ఉన్నారు. మెగాస్టార్, పవర్ స్టార్, మెగాపవర్ స్టార్, స్టైలిష్ స్టార్, పాన్ ఇండియా స్టార్, సూపర్ స్టార్.. ఇలా ఉందరో ఉన్నారు. కోట్లకు పడగలెత్తిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, సినీ వ్యాపారస్తులు ఉన్నారు. తెలంగాణలో సెటిల్ అయినా.. వారి జన్మస్థలం ఆంధ్రప్రదేశే. వారి మూలం ఏపీనే. కానీ ఆంధ్రప్రదేశ్‌కు వారు చేసింది శూన్యం. ఇటీవల సంభవించిన వరదల నేపథ్యంలో కొంత మంది ఉడతా భక్తిగా సహాయం చేస్తే.. మరి కొంత మంది చేతులు బిగించుకొని కూర్చున్నారు. కానీ సోనూ సూద్ స్టైలే వేరు.
ఆయనది ఆంధ్రప్రదేశ్ కాదు. ఏపీలో ఆయన పుట్టీ పెరగ లేదు. కేవలం తెలుగు సినిమాల్లో నటించిన సంబంధం తప్ప మరే అనుబంధం తెలుగు ప్రజలతో లేదు. అదీ కూడా వందల తెలుగు సినిమాల్లో ఆయన నటించిందీ లేదు. పట్టుమని పదో.. లేదా పాతికో ఉంటాయి. ఆయన ఉత్తరాదికి చెందిన వారు. ఎక్కడో పంజాబ్‌లో పుట్టారు. బాలీవుడ్‌లో స్థిరపడ్డారు. యువ సినిమాతో తెలుగుకు పరిచయం అయ్యారు. అతడుతో ఫేమస్ అయ్యారు. అరుంధతీతో మరింత పేరు సంపాదించుకున్నారు. అందులోని బొమ్మాళీ.. నిన్నొదలా అంటూ తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు.