రైతులకు నత్తల దండు సవాల్.. ఏమి చేయాలంటే..
x
మన్యం జిల్లాలో ఓరైతు పంట పొలంలో నత్తల దాడి..

రైతులకు నత్తల దండు 'సవాల్'.. ఏమి చేయాలంటే..

నిన్న మిడతలు.. ఇప్పుడు నత్తలు.. పండ్ల తోటల్ని నాశనం చేస్తున్న తీరుపై రైతుల కలవరం


ఆమధ్య పంటలపై మిడతల దండు దాడులు చేయడం దేశంలోనే పెద్ద కలకలం రేపింది. ఈమధ్య పంటలపై ఏనుగులు, అడవి పందులు దాడులు చేయడం విన్నాం.. ఇప్పుడేమో సాక్షాత్తు నత్తలు దాడులు చేయడం చూస్తున్నాం.. ఇది వినడానికి కాస్తంత కొత్తగా అనిపించినా ఇది నిజం.
ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గంగరేగువలసలో బొప్పాయి పంటపై నత్తలు దాడులు చేస్తున్నాయి. నత్తలు పంటలపై గంపగుత్తగా దాడికి దిగాయి. గంగరేగువలస గ్రామానికి చెందిన కందులపాటి సాయిబాబు అనే రైతు 7 ఎకరాల్లో బొప్పాయి, జామ, పోక చెక్క సాగు చేస్తున్నారు. చేలల్లో సహజంగా నత్తలు ఉంటుంటాయి. పొలం దున్నినపుడు నత్తలు పైకి రావడం మామూలే. అయితే 15 రోజులుగా తోటలోకి పెద్ద సంఖ్యలో నత్తలు వస్తున్నాయి.

నత్తలు పంటల్ని తినేస్తున్నాయి. ఇప్పటికే 4 ఎకరాల మేర పంటల్ని, పండ్లను తినేశాయి. అంతర పంటగా వేసిన 5 వేల టమాటా మొక్కలను కూడా తినేశాయని ఆ రైతు వాపోతున్నారు. అసలు అవి ఎలా, ఎక్కడ నుంచి వస్తున్నాయో కూడా తెలియడం లేదు.
ఈ తోటల సమీపంలో జంఝావతి జలాశయం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో వరద పెరిగి, నత్తలు వచ్చాయేమోనని స్థానికులు భావిస్తున్నారు. తొలుత పదుల సంఖ్యలో వచ్చినప్పుడు రోజూ తొలగించేవాడినని, తర్వాత వందల్లో వచ్చి మొత్తం తినేస్తున్నాయని రైతు సాయిబాబు వాపోతున్నారు. ఇప్పుడిప్పుడే పక్క తోటలకూ సమస్య విస్తరిస్తోందని తెలిపారు.
శాస్త్రవేత్తల సూచనలు...
సాధారణంగా నత్తలు తడి, చెమ్మ ఉన్న నేలల్లో ఎక్కువగా ఉంటుంటాయి. జంఝావతి జలాశయ పరిసర ప్రాంతంలో వరదలు రావడంతో నత్తలు పెద్ద సంఖ్యలో పొలాలకి చేరుకున్న అవకాశముంది. వరి, కూరగాయల పంటలలో ఇవి ఆకులు, కాండాలు, పూతలు తిని తీవ్ర నష్టం కలిగిస్తాయి.
నత్తల సమస్య తమ దృష్టికి మొదటి సారి వచ్చిందని, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తామని ఉద్యానశాఖ అధికారి గిరిజ తెలిపారు. గడ్డ ఉప్పును పంటల్లో వేస్తే ఉపమశనం లభించవచ్చని సూచించారు.
గత అనుభవాలు – నత్తల దాడులు ఎక్కడెక్కడ?
-ఒడిశా, పశ్చిమ బెంగాల్ – వరి పంటలో “Apple Snail” అనే నత్తల దాడులు 2018–19లో తీవ్ర సమస్య అయ్యాయి.
-మధ్యప్రదేశ్ – కూరగాయల పంటలపై నత్తల దండు విస్తరించి, “iron phosphate pellets” వాడి నియంత్రించారు.
-తమిళనాడు – వరదల తరువాత నత్తలు విపరీతంగా విస్తరించి, రైతులు “manual collection, salt application” ద్వారా కొంత నియంత్రించారు.
శాస్త్రవేత్తల సూచనలు – నివారణ, నియంత్రణ
-చేతులతో ఏరి వేయడం. తెల్లవారుజామున నత్తలు గుంపులుగా కనిపిస్తాయి. రైతులు వాటిని సేకరించి, చేలకు బయట పడేయాలి.
-గడ్డ ఉప్పు/సున్నం చల్లి నియంత్రణ

-ఉద్యానశాఖ సూచనల ప్రకారం పొలంలో ఉప్పు లేదా సున్నం (lime) చల్లడం వల్ల నత్తలు ఎండిపోతాయి.
రసాయన/బయో-పద్ధతులు
Metaldehyde pellets లేదా Iron phosphate baits (ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో సిఫార్సు చేసిన పద్ధతి).
Neem oil spray లేదా Garlic-chilli extract స్ప్రే చేస్తే నత్తల కదలిక మందగిస్తుంది.
బయో-పద్ధతులు
బాతులు (ducks) పొలంలో వదిలితే నత్తలను తింటాయి. ఇది ఎకో-ఫ్రెండ్లీ సొల్యూషన్.
కొన్ని పక్షులు, తాబేళ్లు కూడా నత్తల సహజ శత్రువులు.
నీటిని ఎక్కువగా నిల్వ చేయకపోవడం.
పంట చుట్టూ చిన్న గుంతలు త్రవ్వడం ద్వారా నత్తలను బయటికి తరలించడం.
వర్షాల తరువాత పొలాల్లో చెమ్మ ఎక్కువగా ఉంటే వెంటనే పరిశీలించాలి.
పంటలకు ముందు పొలాన్ని బాగా దున్ని, నత్తల గుడ్లను నాశనం చేయాలి.
ఉద్యానశాఖ/విశ్వవిద్యాలయ సలహాలు తీసుకోవాలి.
శాస్త్రవేత్తల పరిశోధనా ఆధారాల ఆధారంగా...
GIANT African Snail (Achatina fulica) వంటి జాతుల మీద పరిశోధనలు జరిపినవి. ఉదాహరణకు, Just Agriculture పత్రికలో రాసినదాన్ని బట్టి భారతదేశంలో 1129 రకాల నత్త జాతులు ఉన్నాయి.
Tamil Nadu Agricultural Universityలోని Entomology విభాగంలో ప్రొఫెసర్ S. Devanesan చేసిన సూచనల ప్రకారం.. ఉప్పు (సాల్ట్), లైమ్, కాపర్ సల్ఫేట్ వాడితే నత్తలు చలనం లేకుండా పడిపోతాయి.
అలాగే బొప్పాయి ఆకు, తడిగా వదిలిన గన్నీ బ్యాగులును బెడ్‌గా ఉపయోగిస్తే అక్కడికి నత్తలు వస్తాయి. వాటిని ఏరి పారేయవచ్చు. ఇది ఎకో-ఫ్రెండ్లీ, సమర్థవంతమైన నియంత్రణ అని సూచించారు
ICAR–Central Arid Zone Research Institute (CAZRI), Jodhpur , All India Network Project on Rodent Control (AINP–Rodent) పరిశోధన చేసి, రైతులకు IRPM (Integrated Rodent Pest Management) మాడ్యూల్స్ అందించారు.
ఈ సూచనలు వ్యవసాయ శాస్త్ర పరిశోధనల ఆధారంగా, శాస్త్రవేత్తలు సిఫార్సు చేసినవి.
Read More
Next Story