
సజ్జల శ్రీధర్‌రెడ్డి రెండో రోజు విచారణ కస్టడీలోకి తీసుకున్న సిట్
మూడు రోజుల పాటు సజ్జల శ్రీధర్‌రెడ్డిని విచారించేందుకు కోర్టు అనుమతులు జారీ చేసింది.
లిక్కర్ స్కామ్‌లో సజ్జల శ్రీధర్‌రెడ్డిని సిట్ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. సజ్జల శ్రీధర్‌రెడ్డిని గురువారం విచారణ చేసిన సిట్ అధికారులు శుక్రవారం కూడా విచారణ చేపట్టేందుకు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జైల్లో ఉన్న ఆయనను శుక్రవారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల చేయించిన తర్వాత విచారణ నిమిత్తం సీపీ కార్యాలయంలోని సిట్ ఆఫీసుకు తరలించారు. తొలి రోజు గురువారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సజ్జల శ్రీధర్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించారు.
మద్యం కుంభకోణంలో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని ఇది వరకే అరెస్టు చేసి విజయవాడ జైలుకు తరలించారు. అయితే సజ్జల శ్రీధర్‌రెడ్డి కీలక నిందితుడుగా ఉన్నాడని, లిక్కర్ కేసులో మరిన్ని వివరాలు ఆయనను నుంచి రాబట్టాల్సి ఉందని, దీని కోసం సజ్జల శ్రీధర్‌రెడ్డిని విచారణ చేపట్టేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిట్ అధికారులు కోరారు. దీని మీద స్పందించిన కోర్టు మూడు రోజుల పాటు సజ్జల శ్రీధర్‌రెడ్డిని కస్టడీకి అనుమతులిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సజ్జలను మూడు రోజుల పాటు విచారించేందుకు సిట్ సిద్ధమైంది. అందులో భాగంగా గురువారం విచారణ చేపట్టిన సిట్ అధికారులు శుక్రవారం కూడా కస్టడీలోకి తీసుకున్నారు. శనివారం కూడా సజ్జలను విచారించనున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో గురువారం చాలా మంది నిందితులను సిట్ అధికారులు విచారణ చేపట్టారు. సజ్జల శ్రీధర్‌రెడ్డితో పాటు రాజ్ కసిరెడ్డి ఏపీ దిలీప్‌ను, ఏ31 నిందితుడుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, ఏ32 నిందితుడుగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డిలను కూడా గురువారం విచారించారు. మరో వైపు సజ్జ శ్రీధర్‌రెడ్డితో పాటు రాజ్ కసిరెడ్డి పీఏ దిలీప్‌లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ల మీద గురువారం విచారణ జరిగింది. వీటిపైన కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులను కోర్టు ఆదేశించింది.
Next Story