రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై సిట్‌.. చీఫ్‌గా బ్రిజ్‌లాల్‌
x

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై సిట్‌.. చీఫ్‌గా బ్రిజ్‌లాల్‌

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారైన వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు మంచి పేరే ఉంది. ఎన్నికల సమయంలో కూడా సిట్‌ చీఫ్‌గా వ్యవహరించారు.


ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది. దీని కోసం ఆరుగురు పోలీసు అధికారులతో కూడిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌)ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విచారణకు సంబంధించి పూర్తి స్థాయి అధికారాలను సిట్‌కు అప్పగించింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను సిట్‌కు చీఫ్‌గా బాధ్యతలను అప్పగించింది. సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్‌ వర్థన్, గోవిందరావు, బాలసుందర్‌రావు, రత్తయ్యలను సిట్‌ సభ్యలుగా నియమించింది. ఆ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి 15 రోజులకు ఒక సారి కేసు పురోగతిపై ప్రభుత్వానికి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సిట్‌ బృందం రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి నివేదికను ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇది వరకు కూడా వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను సిట్‌ బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ సమయంలోను, పోలింగ్‌ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు వినీత్‌ బ్రిజ్‌లాల్‌నే చీఫ్‌గా ఏర్పాటు చేసింది. నాడు 13 మంది సభ్యులతో ఏర్పాటు చేసి దర్యాప్తు బృందానికి వినీత్‌ బ్రిజ్‌లాలే చీఫ్‌గా వ్యవహరించారు. తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటు చేసిన సిట్‌కు సర్వశ్రేష్ట త్రిపాటిని చీఫ్‌గా నియమించింది.


Read More
Next Story