లడ్డూ వివాదంపై సిట్‌ విచారణ నిలిపివేత
x

లడ్డూ వివాదంపై సిట్‌ విచారణ నిలిపివేత

లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో సిట్‌ దర్యాప్తు ఆగి పోయింది. దీంతో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసిందనే చర్చ జరుగుతోంది.


తిరుమల తిరుపతి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని వచ్చిన ఆరోపణలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తును ఈ నెల మూడో తేదీ వరకు నిలిపి వేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమలలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పటికే మూడు రోజులుగా సిట్‌ విచారణ కొనసాగుతోంది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంప పెట్టుగా మారాయి. ఈ నేపథ్యంలోనే దర్యాప్తును ఆపివేశారని పలువురు చర్చించుకోవడం విశేషం. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు తిరుమల వెళ్లిన డీజీడీ మీడియాతో మాట్లాడుతూ సిట్‌ దర్యాప్తును నిలిపి వేస్తున్నట్లు చెప్పారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వం వెనకడుగు వేసిందనే చర్చ కూడా జరుగుతోంది. తిరిగి సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఈ దర్యాప్తు నిలిపివేత కొనసాగుతుంది.


Read More
Next Story