
నేడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి..చంద్రబాబు నివాళి
సీఎం చంద్రబాబు సర్ ఆర్థర్ కాటన్‌కు నివాళులు అర్పించారు.
ప్రముఖ బ్రిటీష్ సైనిక అధికారి, నీటిపారుదల రంగ నిపుణులు, ఇరిగేషన్ ఇంజనీర్, స్వాతంత్య్రానికి పూర్వం ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల రంగానికి విశేష కృషి చేసిన సర్ ఆర్థర్ కాటన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. నేడు జయంతి సందర్భంగా సర్థ ఆర్థర్ కాటన్‌కు సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. ఆ మేరకు సోషల్ మీడియ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
సర్ ఆర్థర్ కాటన్ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాలను నిర్మించారని తెలిపారు. సాగు నీటి కోసం కాలువలు నిర్మించి, స్థిరమైన వ్యవసాయ అభృవృద్ధికి సర్ ఆర్ఠర్ కాటన్ ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. సర్ ఆర్థర్ చేసిన సేవలను ఎవరూ మర్చిపోలేరని.. ఒక వ్యక్తి తలచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో సర్ ఆర్థర్ కాటన అనే మహాశయుడు రుజువు చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
మరో వైపు సర్థ ఆర్థర్ కాటన్ జయంతి ఉత్సవాలను గురువారం పాలకొల్లులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ధవళేశ్వరం ఆనకట్టతో పాటు ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు నాడు సర్థర్ ఆర్థర్ కాటన్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పంట కాలువలు, మురుగు డ్రైన్ల మరమ్మతులు, మెయింటెనెన్స్ వంటి పనుల కోసం సీఎం చంద్రబాబు రూ. 344 కోట్లు కేటాయించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు నిర్మించి, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి సర్ ఆర్థర్ కాటన్ చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో కాటన్ మహశయుడు రుజువు చేశారు. కాటన్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను pic.twitter.com/W3Qcqlnzuc
— N Chandrababu Naidu (@ncbn) May 15, 2025
Next Story