అర్ధరాత్రి సింహాద్రి అప్పన్న చందనోత్సవం
x

అర్ధరాత్రి సింహాద్రి అప్పన్న చందనోత్సవం

విశాఖపట్నం సింహాచలంలో పశ్చిమాభిముఖుడై వెలసిన వరాహ నృసింహస్వామి చందనోత్సవం అర్ధరాత్రి ప్రారంభంకానుంది. స్వామివారి నిజరూప దర్శనం కోసం


విశాఖపట్నం సింహాచలంలో పశ్చిమాభిముఖుడై వెలసిన వరాహ నృసింహస్వామి చందనోత్సవం అర్ధరాత్రి ప్రారంభంకానుంది. స్వామివారి నిజరూప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఉత్సవం ఇది. ఈ ఉత్సవం కోసం అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సింహాచల క్షేత్రంలో ప్రధాన ఉత్సవాలు రెండు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిజరూప దర్శనం ఇచ్చే సింహాచల స్వామి చైత్రమాసంలో పెళ్లికొడుకవుతాడు. వైశాఖ శుద్ధ తదియనాడు ఆయనకు చందనసేవ జరుగుతుంది. చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని, భక్తులపై చల్లని చూపులను ప్రసరింప చేసే దేవుడు సింహాచలం అప్పన్న. అప్ప అంటే తండ్రి అనే అర్థంలో విశాఖ వాసులు ఈ స్వామిని అప్పన్న అని పిలుచుకుంటారు.

నరసింహస్వామి ఉగ్రమూర్తి రూపంలో భయం గొలిపేలా ఉంటాడు. కానీ సింహాచలం అప్పన్నస్వామిలో ఉగ్రత్వం ఏమాత్రం ఉండదు. నిరంతరం చందనపు పూతలో దర్శనమిస్తాడు. ఏడాదికోసారి అక్షయతృతీయ నాడు చందనం పూతను తొలగించి చూస్తే, గరుత్మంతుణ్ణి లాలిస్తూ.. భక్తరక్షణ కోసం తాపత్రయపడుతూ కనిపిస్తాడు. నిజరూపంలో స్వామివారు వరాహ ముఖంతో... మానవ దేహంతో సింహపు తోకతో, జూలుతో వుంటాడు. కుడిచేతి వేలితో గరుత్మంతుడికి అమృతం తాగిస్తూ ఎడమచేతితో వస్త్రాన్ని సరిచేసుకుంటూ ఉన్నట్లుగా దర్శనమిస్తాడు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి కొలువై ఉన్నారు. స్వామివారి పాదాలు భూమిలో కూరుకుపోయి ఉంటాయి.

Read More
Next Story