పకడ్బందీగా డీఎస్సీ నియామక ప్రక్రియ
x

పకడ్బందీగా డీఎస్సీ నియామక ప్రక్రియ

కర్నూలు జిల్లాలో పరిశీలన ప్రక్రయిపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.


మెగా డీఎస్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా జరిగే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, చిన్న ఆటంకం కూడా జరగడానికి వెళ్లేదని విద్యా శాఖ రాష్ట్ర సంయుక్త సంచాలకులు అబ్రహం, ప్రాంతీయ సంచాలకులు కే శామ్యూల్‌ పేర్కొన్నారు. కర్పూలు జిల్లావ్యాప్తంగా మండల విద్యాధికారులకు,ప్రధానోపాధ్యాయులకు, డిప్యూటీ తహసీల్దారులకు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు డీఎస్సీ సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ మీద శిక్షణా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం కర్నూలు కలెక్టర్‌ ప్రాంగణంలో ఉన్న సునయన ఆడిటోరియంలో శనివారం జరిగింది.


ఈ శిక్షణా కార్యక్రమంలో ఆన్‌లైన్‌ విధానం ద్వారా సర్టిఫికెట్ల పరిశీలన ఏ అంశాలపై ఎలా క్షుణ్ణంగా పరిశీలించాలనే అనే అంశాలపై అధికారులు వివరించారు. ఏ చిన్న అవాంతరం కూడా జరగకుండా విద్యాశాఖ సూచించిన నిబంధనల మేరకు విధివిధానాలు అమలు చేయాలని, ఇది విధానాలకు భిన్నంగా సర్టిఫికెట్ల పరిశీలన జరగడానికి వీల్లేదని ఆయా పరిశీలనా బృందాలను ఆదేశించారు. సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ బృందాలు అత్యంత జాగ్రత్తగా ధ్రువపత్రాలను పరిశీలించాలని, ఏ చిన్న అనుమానం వచ్చినా ఉన్నతాధికారులను సంప్రదించాలని కోరారు. సమావేశంలో కర్నూలు జిల్లా యస్‌. శ్యామ్యూల్‌ పాల్, నంద్యాల డిఈఓ జనార్దన్‌ రెడ్డి, కర్నూలు జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు, బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు హాజరై సూచనలు ఇచ్చారు.

Read More
Next Story