సామాజిక రుగ్మతల నిర్మూలనకు లఘుచిత్రాలు ఓ వేదిక
x

సామాజిక రుగ్మతల నిర్మూలనకు లఘుచిత్రాలు ఓ వేదిక

పాలకొల్లులో నాలుగో అంతర్జాతీయ లఘు చలన చిత్ర పోటీలు నిర్వహించారు.


సమాజంలో సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు, వాటిపైన ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు, ప్రజలను చైతన్య పరిచేందుకు లఘు చిత్రాలు ఓ వేదికగా నిలుస్తున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లులో జాతీయ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో శనివారం నాలుగో అంతర్జాతీయ లఘు చలనచిత్ర పోటీలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతి«థిగా పాల్గొన్న నిమ్మల రామానాయుడు సామాజిక బాధ్యతలను ప్రజలకు, సమజానికి గుర్తు చేయడంతో పాటుగా వినోదాన్ని కలించడంలో లఘు చిత్రాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయని పేర్కొన్నారు. నిడివి తక్కువ గల ఈ లఘు చిత్రాలు సమాజానికి మంచి సందేశాలను అందజేస్తున్నాయని అన్నారు. స్మార్ట్‌ ఫోన్లు వచ్చిన తర్వాత లఘు చిత్రాలకు మంచి ఆదరణ పెరిగిందని, లఘు చిత్రాల చిత్రీకరణ కూడా సులువైందన్నారు.

యువత ఎక్కువ శాతం ఈ లఘు చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారని, యువతో దాగి ఉన్న సృజనాత్మకతను, వినూత్నమైన ఆలోచనలను వెలికి తీసేందుకు ఈ లఘు చిత్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. స్మార్ట్‌ ఫోన్లకు సాంకేతిక పరిజ్ఞానం తోడు కావడంతో ఎన్నో మంచి మంచి లఘు చిత్రాలను యువత ఆవిష్కరిస్తోందని, వీటి ద్వారా సరి కొత్త టెక్నీషియన్లు, నటీ నటులు తెరపైకి వస్తున్నారని పేర్కొన్నారు. పాలకొల్లు నుంచి చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రేలంగి నుంచి దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, అల్లు రామలింగయ్య, అనంత శ్రీరమ్‌ వరకు ఎంతో మంది కళాకారులు రాణించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Read More
Next Story