జగన్‌పై న్యాయపోరాటానికి సై అంటున్న షర్మిల
x

జగన్‌పై న్యాయపోరాటానికి సై అంటున్న షర్మిల

జగన్, షర్మిల మధ్య వివాదం కీలక పరిణామం తీసుకుంది. జగన్‌పై న్యాయపోరాటం చేయడానికి షర్మిల సిద్దమవుతున్నారా?


ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య ఏంటో, ఎందుకో తెలియదు కానీ తీవ్రస్తాయలో వివాదం కొనసాగుతుందనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని వారి చర్యలు అనేక సార్లు నిరూపించాయి. ఈ కారణం తెలియని వివాదం రోజురోజుకు ముదురడమే కాకుండా సరికొత్త మలుపులు తీసుకుంటూ ఇంట్రస్టింగ్ థ్రిల్లర్‌లా మారుతోంది. తాజాగా వీరి మధ్య వివాదంపై ఆంధ్ర ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాపారాల్లో షర్మిల తరపున ఓ వ్యాపారవేత్త దాదాపు వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారని ఆయన బాంబు పేల్చారు.

సదరు వ్యాపారవేత్త తనపేరిట ఉన్న షేర్లను షర్మిల పేరుపైకి బదిలీ చేయాలని కోరారని, అందుకు జగన్ ససేమిరా అనేశారని ప్రకాశరావు కీలక అంశాలు చెప్పారు. దీంతో జగన్‌పై న్యాయపోరాటం చేయడానికి షర్మిల సన్నద్ధమవుతున్నారని, అతి త్వరలోనే జగన్, షర్మిల.. కోర్టులో తలపడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని చెప్పారాయన. ఈపెట్టుడి వెనక దివంగత సీఎం వైఎస్ రాజవేఖర్ హస్తం కూడా ఉందంటూ ప్రకాశరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే తన ప్రాణస్నేమితుడి ద్వారా షర్మిల కోసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టించారని, ఆ షేర్లనే ఇప్పుడు బదిలీ చేయడానికి జగన్ అంగీకరించడం లేదని ఆయన వివరించారు.

గాలివానగా మారిన వివాదం

జగన్, షర్మిల మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న వివాదం కాస్తా ఎన్నికల సందర్భంగా చిలికి చిలికి గాలివానగా మారిందని, అందుకనే ఎన్నికల ప్రచారంలో జగనే టార్గెట్‌గా షర్మిల ప్రచారం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తాను చక్రం తిప్పాలన్న ఉద్దేశంతోనే షర్మిల.. తెలంగాణలో ప్రత్యేక పార్టీని స్థాపించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తూ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ పదవిని అందుకున్నారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బలోపేతం కోసం ఆమె శ్రమిస్తున్నారు. ఎన్నికల్లో కూడా భారీగా ప్రచారం చేశారు. కాగా ఎన్నికల ప్రచారంలో షర్మిల తన ఫోకస్ అంతా వైసీపీని ఓడించడంపైనే పెట్టారు. తాజాగా ఈ అన్నాచెల్లెలి మధ్య ఉన్న వివాదం ఊహించని మలుపు తిరిగింది. జగన్ నుంచి తన వాటా ఆస్తిని పొందడానికి షర్మిల న్యాయపోరాటం చేయాలని ఫిక్స్ అయినట్లు ప్రకాశరావు వ్యాఖ్యానించారు.

జగన్ రాజీ పడతారా

అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో షర్మిలతో పెంచుకున్న విభేధాలు కీలకంగా మారాయని వైసీపీ గ్రహించింది. దీంతో ఇప్పటికైనా జగన్.. రాజీ మార్గాన్ని ఎంచుకుందని షర్మిలతో విభేదాలను పరిష్కరించుకుంటారా అని చర్చ జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు. ఈ వివాదాన్ని ఇంకా పెంచుకుంటే జగన్ మరింత నష్టపోవాల్సి వస్తుందని నేతలు అభిప్రాయపడుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే జగన్ ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటారని చర్చ జోరుగా సాగుతోంది.

Read More
Next Story