
భద్రాచలంలో భవనం కూలి ఏడుగురు మృతి
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు మరణించారు
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు మరణించారు. అందుబాటులోని వివరాలు ప్రకారం భద్రాచలం(Bhadrachalam) పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో ఆరు అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతోంది. అన్నీ అంతస్తులకు స్లాబులు వేసారు. అయితే ఏమైందో ఏమోగాని సడెన్ గా బుధవారం మధ్యాహ్నం అన్నీ స్లాబులు(Building collapsed) ఒక్కసారిగా కూలిపోయింది. ఊహించనిరీతిలో భవనం స్లాబులు కూలిపోవటంతో భవనం నిర్మాణంలో ఉన్న కూలీలు శిధిలాల్లో ఇరుక్కుపోయారు. తాజా సమాచారం ప్రకారం ఏడుగురు మరణించారు(Seven died in accident). ఇంకా చాలామంది శిధిలాల్లోనే ఇరుక్కుపోయారు. శిధిలాలను తొలగించి అందరినీ బయటకు తీసుకొచ్చేందుకు పొక్లయినర్ల సాయంతో అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. ఎంతమంది మరణించారు ? ఎంతమంది శిధిలాల్లో ఇరుక్కున్నారనే విషయంలో క్లారిటిలేదు. మరణించిన వాళ్ళ వివరాలు ఇంకా రావాల్సుంది.