
మూడు సార్లు రద్దైన సీనియర్ ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటీషన్
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు, సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ మూడోసారి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, అక్రమ పనులకు పాల్పడారనే ఆరోపణలతో ఏసీబీ నమోదు చేసిన కేసులో సంజయ్ జ్యుడీషియల్ రిమాండ్‌లోనే ఉండాలని కోర్టు నిర్ణయించింది. 1996 బ్యాచ్ అధికారి సంజయ్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ ఏడీజీగా పనిచేసినప్పుడు టెండర్లు లేకుండా పరికరాల కొనుగోలు, ప్రైవేట్ కంపెనీలకు అక్రమ చెల్లింపులు, ప్రాజెక్టుల అమలులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల మీద డిసెంబర్ 24, 2024న ఏసీబీ కేసు నమోదు చేసింది, ఈ క్రమంలో సంజయ్ ని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 4న సస్పెండ్ చేసింది.
అయితే సంజయ్ తన తొలి బెయిల్ పిటిషన్‌ను సెప్టెంబర్ 18, 2025న కోర్టు తోసిపుచ్చింది. అక్టోబర్ 13న దాఖలైన రెండో పిటిషన్‌పై ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది "బెయిల్ ఇవ్వకూడదు" అని వాదించడంతో అది కూడా డిస్మిస్ అయింది. తాజా మూడో పిటిషన్ విచారణలో కూడా ఏసీబీ తమ వాదనలను బలంగా వినిపించడంతో మూడో పిటీషన్ ని కూడా కోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు జులై 31, 2025న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన అంటిసిపేటరీ బెయిల్‌ను రద్దు చేసి, మూడు వారాల్లో సరెండర్ కావాలని ఆదేశించింది. దీంతో ఆగస్టు 26న సంజయ్ ఏసీబీ కోర్టులో సరెండర్ అయ్యారు. జనవరి 2025లో హైకోర్టు "ఐపీఎస్ అధికారి కాబట్టి పారిపోయే అవకాశం లేదు" అని షరతులతో అంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినా, రాష్ట్రం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో అది రద్దయింది.
గత వైసీపీ ప్రభుత్వ కాలంలో సీఐడీ చీఫ్‌గా సంజయ్ పని చేస్తున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌డీసీ) స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసులలో చంద్రబాబు నాయుడుపై దర్యాప్తు పర్యవేక్షించారు. ఈ కేసుల వల్ల చంద్రబాబు దాదాపు రెండు నెలలు జైలులో గడిపారు. జూన్ 2024లో TDP-కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంజయ్‌ను ట్రాన్స్‌ఫర్ చేసి, DGP కార్యాలయంలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఏసీబీ దర్యాప్తులో సంజయ్‌పై టెండర్ మానిప్యులేషన్, ఫండ్ మిస్‌అప్రొప్రియేషన్ వంటి అభియోగాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4న సంజయ్ ని ఏసీబీ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఈ కేసును TDP ప్రభుత్వం "పాలిటికల్ వెంజెన్స్"గా చూస్తోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. జ్యుడీషియల్ కస్టడీ ఆక్టోబర్ 31 వరకు పొడిగించబడింది. సంజయ్ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. మూడో బెయిల్ పిటిషన్ డిస్మిస్‌తో, దర్యాప్తు మరింత ఊపందుకునే అవకాశం ఉంది.

