కాదంబరి కేసులో మరో కీలక ట్విస్ట్.. ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు..
x

కాదంబరి కేసులో మరో కీలక ట్విస్ట్.. ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు..

ముంబై నటి కాదంబరి జిత్వాని కేసు మరో కీలక మలుపు తీసుకుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు చేరారు. వీరు ముగ్గురు కూడా సీనియర్ ఐపీఎస్ అధికారులు కావడం ప్రస్తుతం రాష్ట్రమంతా సంచలనంగా మారింది.


ముంబై నటి కాదంబరి జిత్వాని కేసు మరో కీలక మలుపు తీసుకుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు చేరారు. వీరు ముగ్గురు కూడా సీనియర్ ఐపీఎస్ అధికారులు కావడం ప్రస్తుతం రాష్ట్రమంతా సంచలనంగా మారింది. వీరిలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురిపై ముంబై నటి కేసు సహా ఉన్న ఇతర అభియోగాలపై కూడా విచారణ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీరు పోలీసు వ్యవహారాలకు దూరంగా ఉండాలని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

తప్పుడు కేసులో సినీ నటి కాదంబరి జిత్వానిని అరెస్ట్ చేసి, తీవ్ర వేధింపులకు గురి చేసిన వ్యవహారంలో వీరు ముగ్గురు కీలక పాత్రధారులని సదరు నటి చెప్తోంది. ఆమె చేస్తున్న తీవ్ర ఆరోపణలు నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీసు అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు రంగంలోకి దిగారు. ఇబ్రహీంపట్నంలో జిత్వాని, ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలిస్తున్నారు. ఆ కేసు దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్లు ఆయన గుర్తించారని సమాచారం.

వైసీపీ నేతపై కేసు

కాదంబరి జిత్వానీ కేసు మరోసారి ఇబ్రహీంపట్నం చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేశారని జిత్వానీ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు సెక్షన్లు 192, 211, 218,220, 35, 467, 420, 469, 471, రెడ్‌విత్ 120బి కింద వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సందర్భంగానే జిత్వానీ కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించారు.

Read More
Next Story