సేనతో సేనాని పోస్టర్ ఆవిష్కరణ
x

సేనతో సేనాని పోస్టర్ ఆవిష్కరణ

విశాఖలో 3 రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశాలకి సిద్ధం


విశాఖపట్నం వేదికగా సేనతో సేనాని పేరిట కార్యక్రమం నిర్వహణకు జనసేన పార్టీ సిద్దమైంది.ఈ కార్యక్రమం ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు, మూడు రోజుల పాటు జరుగుతుందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారన్నారు.ఆదివారం విశాఖపట్నంలో సేనతో సేనాని కార్యక్రమం పోస్టర్‌ను ఆ పార్టీ నేతలతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు.

విశాఖ మూడు రోజుల సమావేశ వివరాలను నాందేండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు.28వ తేదీ ఉదయం జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం, మధ్యాహ్నం పార్టీ కార్యవర్గ సమావేశం ఉంటుంది.29తేదీన పార్లమెంట్ నియోజక స్థాయి సమావేశాలను నిర్వహిస్తారు. పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు.ప్రభుత్వ పరంగా అమలవుతున్న కార్యక్రమాలు,పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన మంత్రులు బాధ్యత వహిస్తున్న శాఖల పరంగా కనిపిస్తున్న అభివృద్ధిపై చర్చలు కొనసాగుతాయి. 30వ తేదీన జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు.
కూటమి ప్రభుత్వంపై సొషల్ మీడియా వేదికగా చేసుకుని ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని జనసేన పార్టీ కేడర్‌కు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.మూడు రోజుల సమావేశాలు పార్టీకి కీలకంగా భావిస్తున్నారు.కూటమి పార్టీల మధ్య సమన్వయం ఎలావుందన్నది ఈ సమావేశాల సందర్భంగా చర్చిస్తారు.ముఖ్యంగా పలు నియోజక వర్గాలలో తెలుగుదేశం నాయకులే పెత్తనం చెలాయిస్తున్న అంశం గతంలోనే అధినేత దృష్టికి తెచ్చిన జనసేన నేతలు , ఈ సమావేశాల సందర్భంగా మరోమారు ప్రస్తావనకు తేవాలని ,ఈ విషయంలో కీలక నిర్ణయం అవసరమని భావిస్తున్నారు.
పార్టీ పరంగా ఎన్నికల సందర్భంగా అంతకు ముందు జనసేన అధినేతగా ప్రజల సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందించిన విషయాలను కూడా ఈ సమావేశాలలో చర్చించి,వాటి అమలుకు చర్యలు చేపట్టనున్నారు.కూటమి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపైనా , ప్రజలలో ఎంత వరకూ అసంతృప్తి కొనసాగుతోందన్న విషయంపైనా దృష్టి పెడతారు.వీటితో పాటు ప్రస్తుతం గెలిచిన 21 నియోజక వర్గాలతో పాటు పార్టీ బలంగా వున్న మిగతా నియోజక వర్గాలలో ఎలా కార్యాచరణ చేపట్టాలన్నదీ విశాఖ సమావేశాలలో నిర్ణయిస్తారు. అటు తెలంగాణ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవు తుండటంతో , ఆ రాష్ట్రంలో పార్టీ అభివృద్దికి చేపట్టాల్సిన కార్యాచరణపైనా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారు.
Read More
Next Story