సీఎం చంద్రబాబు ఇంటి వద్ద డ్రోన్లతో భద్రత
x

సీఎం చంద్రబాబు ఇంటి వద్ద డ్రోన్లతో భద్రత

ఏపీ సీఎం తన సెక్యురిటీ స్టైల్‌ను మార్చుకున్నారు. ఆధుని టెక్నాలజీని ఉపయోగించుకొని భద్రతా సిబ్బంది మోనటరింగ్‌ చేపడుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్రోన్‌ టెక్నాలజీకి అంబాసిడర్‌గా మారారు. ఇప్పటికే డ్రోన్ల సమ్మెట్‌ను నిర్వహించడంతో పాటు భారీ ఎత్తున డ్రోన్ల ఎగ్జిబిషన్‌ నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రతి రంగంలో డ్రోన్ల టెక్నాలజీని ఉపయోగించుకోవాలనే విధంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా తన భద్రత పర్యవేక్షణకు కూడా డ్రోన్ల టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు. ఉండవల్లి, కృష్ణా నది కరకట్టపైన ఉన్న తన నివాసం వద్ద భద్ర పర్యవేక్షణను డ్రోన్ల సహాయంతో చేసే విధంగా అడుగులు వేశారు. అటానమస్‌ డ్రోన్ల సహాయంతో సీఎం నివాసం వద్ద భద్రత పర్యవేక్షణ చేయనున్నారు. జడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన సీఎం చంద్రబాబుకు ప్రస్తుతం 121 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. తన కాన్వాయ్‌ని కూడా తగ్గించుకున్నారు. జగన్‌ సీఎంగా ఉండగా 17 వాహనాలతో కాన్వాయ్‌ ఉండగా, సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ వాహనాల సంఖ్యను 11కి తగ్గించుకున్నారు. అయితే భద్రత పర్యవేక్షణ కోసం చంద్రబాబు నివాసం వద్ద ఇప్పటికే డ్రోన్లను ఏర్పాటు చేశారు. ప్రోగ్రాం చేసిన విధంగా ఈ అటానమస్‌ డ్రోన్లు పని చేస్తాయి. ప్రతి రెండు గంటలకు ఒక సారి నివాసం వద్ద గాల్లోకి ఎగిరి పరిసర ప్రాంతాలకు సంబంధించిన వీడియోలను రికార్డు చేస్తుంది. అటానమస్‌ విధానంలో ఆటోపైలెట్‌ విధానంలో ఆయా ప్రాంతాల్లో ఈ డ్రోన్‌లు ఎగురుతాయి. ప్రోగ్రామ్‌ ఇచ్చిన విధంగా నిర్థేశించిన ప్రాంతంలో ల్యాండ్‌ అవుతుంది. పరిసర ప్రాంతాల్లో సాధారణ పరిస్థితుల కంటే ఏమాత్రం భిన్నమైన మూమెంట్‌ కనిపించినా, కొత్త వస్తువులు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ కనిపించినా వాటి గురించిన వివరాలను మోనటరింగ్‌ టీమ్‌కు మెసేజ్‌ ద్వారా చేరవేస్తాయి. వీటిని భద్రతా సిబ్బంది, మోనటరింగ్‌ టీమ్‌ విశ్లేషించుకొని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

Read More
Next Story