రాజధాని కోసం రెండు జిల్లాల్లోని భూములు
x

రాజధాని కోసం రెండు జిల్లాల్లోని భూములు

అమరావతి ప్రాంతంలోని పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన ఏడు గ్రామాల పరిధిలోని భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోనున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూసమీకరణ ప్రక్రియ అధికారికంగా మొదలైంది. అమరావతి రాజధానిగా ప్రకటించిన తొలి నాళ్లల్లో రెండో దశ భూసేకరణ ప్రస్తావన చేయలేదు. నాడు సేకరించిన 29 గ్రామాలలకు చెందిన భూములతోనే అంతర్జాతీయ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ప్లాన్ మార్చుకున్నారు. నాడు సేకరించిన భూములు సరిపోవని సమీపంలోని ఏడు గ్రామాలకు చెందిన భూములను కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే రాజధాని రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో వెనకడుగు వేశారు. అయితే తన నిర్ణయాన్ని మాత్రం ప్రభుత్వం మార్చుకోలేదు. తక్కిన భూములు ఇవ్వక పోతే అమరావతి ఒక మున్సిపాలిటీగానే అమరావతి మిగిలిపోతుందని, అంతర్జాతీయ నగరంగా అమరావతి రూపుదిద్దుకోవాలంటే తక్కిన ఏడు గ్రామాల భూములు కూడా కావాలని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆ మేరకు ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో రెండో దశ భూసమీకరణ చేపట్టాలని నిర్ణయించారు. రెండో దశ భూసమీకరణ చేపట్టాలని సీఆర్డీఏకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు మున్సిపల్ శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రెండో దశ భూసమీకరణ షురూ అయ్యింది.

ముఖ్యాంశాలు:

  • మొత్తం రెండో విడతలో సమీకరించే భూమి: 20,494.87 ఎకరాలు
  • ఇందులో రైతుల నుంచి (పట్టా + అసైన్డ్): 16,666.57 ఎకరాలు
  • ప్రభుత్వ భూమి: 3,828.30 ఎకరాలు

ఏ గ్రామాల్లో ఎంత భూమి సేకరిస్తారు?

పల్నాడు జిల్లా - అమరావతి మండలం (4 గ్రామాలు)

  1. వైకుంఠపురం
    • పట్టా: 1,965 ఎకరాలు
    • ప్రభుత్వం: 1,395.48 ఎకరాలు
  2. పెదమద్దూరు
    • పట్టా: 1,018 ఎకరాలు
    • ప్రభుత్వం: 127 ఎకరాలు
  3. ఎండ్రాయి
    • పట్టా: 1,879 ఎకరాలు
    • అసైన్డ్: 46 ఎకరాలు
    • ప్రభుత్వం: 241 ఎకరాలు
  4. కర్లపూడి లేమల్లె
    • పట్టా: 2,603 ఎకరాలు
    • అసైన్డ్: 51 ఎకరాలు
    • ప్రభుత్వం: 290.75 ఎకరాలు

గుంటూరు జిల్లా - తుళ్లూరు మండలం (3 గ్రామాలు)

  1. వడ్డమాను
    • పట్టా: 1,763.29 ఎకరాలు
    • అసైన్డ్: 4.72 ఎకరాలు
    • ప్రభుత్వం: 168.86 ఎకరాలు
  2. హరిశ్చంద్రాపురం
    • పట్టా: 1,448.09 ఎకరాలు
    • అసైన్డ్: 2.29 ఎకరాలు
    • ప్రభుత్వం: 977.87 ఎకరాలు
  3. పెదపరిమి
    • పట్టా: 5,886.18 ఎకరాలు (ఇదే అత్యధికం)
    • ప్రభుత్వం: 627.34 ఎకరాలు

ముఖ్యమైన నిర్ణయాలు:

  • జూన్ 24, 2025: కేబినెట్ రెండో విడత భూసమీకరణకు ఆమోదం
  • నవంబర్ 28, 2025: మంత్రివర్గం 7 గ్రామాల్లో 20,494.87 ఎకరాల సేకరణకు ఆమోదం
  • డిసెంబర్ 2, 2025: సీఆర్‌డీఏ కమిషనర్‌కు అధికారిక అనుమతి ఉత్తర్వులు జారీ (ఎస్. సురేష్ కుమార్)

రైతులకు ప్రయోజనాలు:

భూమి ఇచ్చే రైతులకు ల్యాండ్ పూలింగ్ స్కీం మార్గదర్శకాల ప్రకారం ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Read More
Next Story