చెప్పేదొకటి..చేసేది మరొకటి: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాణి ఫైర్
x

చెప్పేదొకటి..చేసేది మరొకటి: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాణి ఫైర్

సీఎం చంద్రబాబు టీడీపీ పార్టీ నేతలకు ఒకటి చెబుతారు, క్షేత్ర స్థాయిలో మరొకటి చేస్తారని కాకాణి మండిపడ్డారు.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటలకు, చేష్టలకు పొంతన ఉండదని, ఆయన చెప్పేది ఒకటి, చేసేది మరొకటని వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. సూపర్‌ సిక్స్‌లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఇసుకపై కొత్త నాటకానికి తెర తీసారని మండి పడ్డారు. నెల్లూరులో శనివారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబా, దొంగ ఎమ్మెల్యేలు అన్నట్లు ఉందన్నారు. చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే అన్నట్లు ఉందని, పార్టీ నేతలకు ఒకటి చెబుతారు, క్షేత్ర స్థాయిలో మరొకటి జరుగుతుందని అన్నారు. ఇసుక, మద్యం జోలికి వెళ్ళొద్దని చెబుతారు, కానీ టీడీపీ నేతలు వాటినే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని అన్నారు. ఉచిత ఇసుక ఇస్తామన్నారు. ఇప్పుడు సీనరేజ్‌ రద్దు చేస్తామని చెబుతున్నారు. ఇసుక ఉచితం అన్పప్పుడు సీనరేజ్‌ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. మద్యం, ఇసుక టెండర్లు పొందిన వారిని మంత్రులు భయపెడుతున్నారని, ఇసుక, మద్యంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచారని, లాటరీ ద్వారా ఎంపిక చేయాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలిచ్చారని అన్నారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 25న కలెక్టరేట్‌ వద్ద ఆందోళన నిర్వహిస్తామని కాకాణి చెప్పారు.

Read More
Next Story