రేవంత్-కేటీయార్ మధ్య చీరల గొడవ
x

రేవంత్-కేటీయార్ మధ్య చీరల గొడవ

ఉన్న గొడవలు సరిపోనట్లు కొత్తగా రేవంత్ రెడ్డి, కేటీయార్ మధ్య చీరల గొడవ మొదలైంది.


ఉన్న గొడవలు సరిపోనట్లు కొత్తగా రేవంత్ రెడ్డి, కేటీయార్ మధ్య చీరల గొడవ మొదలైంది. ఉరిమి ఉరిమి మంగళంమీద పడిందన్నట్లుగా ఇద్దరి గొడవల మధ్య ఆడవాళ్ళు కట్టుకునే చీరల ప్రస్తావన పెరిగిపోతోంది. చీరను నువ్వు కట్టుకోమంటే కాదు కాదు నువ్వే కట్టుకోవాలి లేదా రాహుల్ గాంధీకి కట్టించంటు రేవంత్ రెడ్డి, కేటీయార్ గొడవపడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే చీరను కట్టుకోవాలని కేటీయార్ను ఆదివారం ఉదయం రేవంత్ రెడ్డి ఎద్దేవాచేశారు. సాయంత్రానికి చీరను రేవంత్ కట్టుకుంటాడా లేకపోతే రాహూల్ గాంధీకి కట్టిస్తారా అంటు కేటీయార్ చురకలంటించారు. రేవంత్, కేటయార్ మధ్య గొడవలో రాహుల్ గాంధీని కూడా లాగి చీరకట్టుకోమని చెప్పటమే విచిత్రంగా ఉంది.

విషయం ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీల్లో ఒక్కటి కూడా సక్రమంగా అమలుకావటంలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ పదేపదే తన ఎన్నికల ప్రచారంలో ఆరోపిస్తున్నారు. దానికి బదులుగా రేవంత్ రెడ్డి నిర్మల్ లో జరిగిన జనజాతరలో మాట్లాడుతు కేటీయార్ ను ‘చీరకట్టుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయ’మన్నారు. ‘కేటీయార్ చీరకట్టుకని బస్సులో జోగులాంబ ఆలయం దాకా ప్రయాణంచేస్తే హామీలు అమలవుతున్నాయో లేదో తెలుస్తుంది’ అని సవాలు విసిరారు. దానికి బదులుగా సాయంత్రం మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలో జరిగిన రోడ్డుషోలో కేటీయార్ మాట్లాడుతు రేవంత్ ను లేదా రాహూల్ గాంధీనే చీరకట్టుకోమన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీల్లో ఒక్కటికి కూడా సంపూర్ణంగా అమలు చేయనందుకు రేవంత్ కట్టుకుంటారా చీర లేదా మద్దతిచ్చినందుకు రాహుల్ గాంధీకి చీరకట్టిస్తారా’ అంటు ప్రశ్నించారు.

మహిళలకు నెలకు రు. 2500 ఇస్తున్నారా అంటు కేటీయార్ నిలదీశారు. రు. 2500 కోసం రాష్ట్రంలోని 18 ఏళ్ళు నిండిన అమ్మాయిల నుండి పెద్దవాళ్ళవరకు 1.68 కోట్లమంది ఎదురుచూస్తున్నట్లు కేటీయార్ ఎద్దేవాచేశారు. వందరోజుల్లో అన్నీచేస్తానని చెప్పి మాట తప్పినందుకు కాంగ్రెస్ ను బొందపెట్టేది ఆడబిడ్డలే అని కేటీయార్ ఘాటుగా స్పందించారు. హామీలను అమలుచేయకుండా అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలను ఓట్లడిగే హక్కులేదని కేటీయార్ తేల్చిచెప్పారు.

Read More
Next Story