సరస్వతి పవర్‌ ప్లాంట్‌ వాస్తవాలివే : వైఎస్ జగన్
x

సరస్వతి పవర్‌ ప్లాంట్‌ వాస్తవాలివే : వైఎస్ జగన్

తన వ్యాపార సంస్థ అయిన సరస్వతి పవర్‌ ప్లాంట్‌పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించారు.


కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, జగన్‌ వ్యాపార సంస్థ సరస్వతి పవర్‌ ప్లాంట్‌పై చేసిన ఆరోపణల నేపథ్యంలో మాజీ సీఎం జగన్‌ దీనిపై స్పందించారు. గురువారం జగన్‌ మాట్లాడుతూ సరస్వతి పవర్‌ ప్లాంట్‌ భూములకు సంబంధించి చెప్పాలంటే, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఈ నెల 5వ తేదీన అక్కడికి వెళ్లారు. అక్కడ సిమెంట్స్‌ కంపెనీ కోసం భూములు కొన్నాను. కంపెనీ పేరు సరస్వతి పవర్‌ ప్రాజెక్ట్‌. పవన్‌కళ్యాణ్‌ అక్కడికి వెళ్లడానికి ముందే, ఆయన ఆదేశాలతో లోకల్‌ ఎమ్మార్వో గత అక్టోబరు 26న అక్కడికి వెళ్లి, భూములు తనిఖీ చేసి, ఏమన్నారో చూద్దాం అంటూ.. ఫోన్‌లో వీడియో ప్రదర్శించారు.

వెయ్యి చిల్లర ఎకరాలకు సంబంధించిన కథ ఆమె చెప్పింది. అవన్నీ పట్టా భూములని, అందులో కేవలం 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. అయితే అది కూడా తీసుకోలేదని ఆమె స్వయంగా చెప్పారు. పైగా అందులో 2 ఎకరాలు కొండలు ఉన్నాయని వివరించారు. దీనికి పవన్‌కళ్యాణ్‌ అక్కడికి పోవడం, ఏమేమో జరుగుతోందని మాట్లాడడం, విమర్శించడం, ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. పక్కనే భవ్య సిమెంట్‌ వాళ్లు ఎకరా రూ.50 వేల నుంచి రూ.90 వేల లోపు కొన్నారు.
ఆ ధరకు వారు కొంటే, ఆ పక్కనే ఏడాది తర్వాత మనం ఎకరా రూ.3 లక్షలకు తక్కువకు కొనలేదు. గ్రామసభ పెట్టి, రేటు ఎంత కావాలని వారినే అడగమన్నాను. ఆ సభలో రైతులు ఎకరాకు రూ.2.75 లక్షలు కావాలంటే, నేను రూ.3 లక్షలు ఇవ్వమన్నాని చెప్పుకొచ్చారు. అంత ధర ఇచ్చి కొన్నామన్నారు. మా దగ్గర అనంతపురం జిల్లాలో దివాకర్‌రెడ్డి ఉన్నారు. ఆయన తన ఇంట్లోని పనివాళ్ల పేరుతో కూడా భూమి తీసుకున్నాడని విమర్శలు చేశారు. కానీ, నేను రైతులను సంతోషపెడుతూ, వారు అడిగిన దానికంటే ఎక్కువ ధర ఇచ్చి భూములు కొన్నానని చెప్పారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ పెడితే, అక్కడ పని చేసే వారికి, కంపెనీకి నీళ్లు వద్దా? ఎవరైనా కంపెనీ పెడితే నీరు, పవర్‌ ఇవ్వడం బాధ్యతని పేర్కొన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం అనే వ్యకి లా అండ్‌ ఆర్డర్‌ ఈ స్థాయికి దిగజారింది అన్నారంటే.. ఆశ్చర్యం కలిగించే ఘటనని అన్నారు. నిజానికి లా అండ్‌ ఆర్డర్‌ ఎవరి వద్ద ఉంటుంది. సీఎం చంద్రబాబు వద్ద కదా? మరి ప్రశ్నిస్తే ఆయన్ను కదా అనాలని ప్రశ్నించారు. పిఠాపురంలో టీడీపీ నాయకుడు ఒక దళిత యువతిని డంప్‌యార్డు వద్దకు తీసుకెళ్లి, అత్యాచార యత్నం చేస్తే, నువ్వేం చేశావని పవన్‌ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. కడపలో సజ్జన్‌ జిందాల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మందుకు వచ్చి, భూమి పూజ కూడా చేశారు. ఆయన్ను ప్రోత్సహించాల్సింది పోయి, జెత్వానీని తీసుకొచ్చి, కేసులు పెట్టించారని, ఆమె వృత్తి రీత్యా నేరస్తురాలని చెప్పారు.
Read More
Next Story