
సంత్ సేవాలాల్ మూడు రోజుల పండుగ ప్రారంభం
అనంతపురం జిల్లా గొల్లల దొడ్డి సేవాలాల్ ఆశ్రమానికి బారులు తీరిన బంజారాలు
సంత్ సేవాలాల్ మూడు రోజులు ఉత్సవాలకు పురష్కరించుకుని అనంతపురం జిల్లా గొల్లల దొడ్డిఅనంతపురం జిల్లా గొల్లల దొడ్డి ప్రాంతానికి బస్సు సౌకర్యం, మంచినీరు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలోపలువురు ప్రాంత మేధావులు విజ్ఞప్తి చేశారు.
సేవాలాల్ మూడు రోజుల పండుగసేవాలాల్ మూడు రోజుల పండుగఫిబ్రవరి 13 నుంచి 15 వరకు వైభవంగా జరుగుతుంది. ఈపండుగ వాతావరణం స్ఫూర్తిదాయకం కావాలని ప్రజాసైన్స్ వేదిక నాయకులు డాక్టర్ ముచ్చుకోట సురేష్ బాబు కోరారు.
రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు డా. రామచంద్ర, బంజారా యూత్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి దశరథ్ నాయక్, రాజశేఖర్ వర్మ, రాఘవేంద్ర, పౌర స్పందన వేదిక ప్రొ జీ వెంకటశివ రెడ్డి, డా ప్రణయనాథ్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో ప్రసంగిస్తూ సేవాలాల్ బోధన సారాంశం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.
భారతీయ సామాజిక, మత సంస్కర్త, సమాజ నాయకుడు గోర్ బంజారా (Goar Banjara) సమాజంచే ఆధ్యాత్మిక గురువుగా గౌరవించబడిన సేవాలాల్ మహారాజ్ (Sant Sevalal Maharaj) 286 వ జయంతి 15 ఫిబ్రవరి. గురు సేవాలాల్ మహారాజ్ 18వ శతాబ్దంలో భీమా నాయక్ ధరమణి యాది దంపతులకు 15 ఫిబ్రవరి 1739లో జన్మించారు. అతను 4 డిసెంబర్ 1806 న రుహిగఢ్ (యవత్మాల్ జిల్లా) వద్ద మరణించాడు. ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలోని వాషిమ్ జిల్లాలోని పోహరగర్లో ఖననం చేయబడ్డాడు. అతని సమాధి ఇప్పటికీ జగదాంబ దేవికి అంకితం చేయబడిన ఆలయానికి ప్రక్కనే ఉంది. ఇది బంజారాలకు ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. బంజారా ఉత్సవాలలో ప్రసిద్ధి చెందిన సేవాలాల్‌ను కీర్తిస్తూ జానపద పాటలు ఉన్నాయి. ప్రతి బంజారా/గోర్/లంబాడి గ్రామంలో శ్రీ సేవాలాల్ గురువుకు దేవాలయం ఉంటుంది.
బంజారాలందరూ ప్రతి గ్రామంలో జగదాంబకు గులాబీ లేదా ఎరుపు రంగు జెండాలను, శ్రీ శాంత్ సేవాల మహరాజ్‌కు తెలుపు రంగులను ఎగురవేస్తారు.
సేవాగడ్ అనేది సంత్ సేవాలాల్ బాబా పుట్టి పెరిగిన పవిత్ర ప్రదేశం. సేవాగడ్ అనంతపురం జిల్లా గుత్తి నుంచి గుంతకల్లుకు వెళ్లే మార్గంలో గొల్లల దొడ్డి సమీపంలో ఉంది. సేవాలాల్ ఆశ్రమం 48 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనంతో నిండి ఉంటుంది. సేవాలాల్ ఆశ్రమం అతని బోధనల ద్వారా మనందరికీ స్ఫూర్తినిస్తుంది.
ఒక గొప్ప సాధువుకు జన్మస్థలంలోనే ఆలయాన్ని నిర్మించడం విషయం. జగదాంబ దేవి సేవాలాల్ ముందు ప్రత్యక్షమై అతనిలో కర్తవ్య ఆవాహన చేసిన ప్రదేశం కూడా ఇదే. ఇక్కడే అమ్మవారి ఆలయం కూడా ఉంది. తన జీవిత కాలంలో, సేవాలాల్ బాబా తరచుగా కాలోకుండోకు దగ్గరగా ఉన్న కొండపై ఉన్న చెన్న కేశవ ఆలయాన్ని సందర్శించేవారు.
అతని గుర్రపు అడుగు గుర్తులు ఇప్పటికీ ఇక్కడ ఒక రాయిపై చూడవచ్చు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు సేవాలాల్ బాబా మాల ధరించి 40 రోజుల వ్రతాన్ని అనుసరిస్తారు. సేవాలాల్ బాబా ఆశీర్వాదం, భక్తుల కానుకల, విరాళాల వల్ల నిత్య అన్నదానం విజయవంతంగా అమలులోకి వచ్చింది. ఇక్కడ భక్తులకు ఉచిత భోజనం అందించబడుతుంది. సేవాలాల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు రంజిత్ నాయక్ సేవాలాల్ బాబాకు అత్యంత భక్తిశ్రద్ధలతో సేవలందించారు. ముంబైలో ఆయన మరణించిన తర్వాత, సేవాగఢ్‌లో ఆయన సమాధిని నిర్మించారు.
సేవాలాల్ ఆశ్రమం వెలుపల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, జూనియర్ కాలేజీ, జడ్పీ హైస్కూల్ ఉన్నాయి. నిరుపేద విద్యార్థులకు ఇది ఒక సదవకాశం. గ్రామీణ క్రీడలు, పిల్లల్లో మంచి ఆరోగ్య ఆహార అలవాట్లు పెంపొందించేందుకు ఆటలు పాటల తో ఈ ప్రాంతం ఈ వారం రోజులు మారుమోగుతుంటుంది.
మీరు మీ స్వంత కుటుంబానికి సేవ చేసినట్లుగా సమాజానికి సేవ చేయండి అని, ఎవ్వరి పట్ల ఏ కారణంతోనైనా వివక్ష చూపవద్దు అని సేవాలాల్ ప్రబోధించారు. ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతి నుండి విడిపోకుండా ప్రతి మనిషీ జీవించాలన్నారు. చెట్లు నాటడం, చెట్లు జంతువులను రక్షించడం ప్రథమ కర్తవ్యంగా భావించాలి. జంతువులను కసాయిలకు అమ్మవద్దు అనేది ఆయన బోధన.
స్త్రీలను గౌరవించడం, ఆడపిల్లలు, కూతుళ్లను దేవతలుగా చూడాలన్నారు. జ్ఞానాన్ని వెతకండి, ఎల్లప్పుడూ విధేయత గల విద్యార్థిగా, కఠిన అభ్యాసకుడిగా ఉండాలన్నారు. వరకట్నానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించారు. పెద్దలను గౌరవిస్తూ పిల్లలను ప్రేమించమన్నారు. కమ్యూనిటీ భాష (గోర్ బోలి) దుస్తులను రక్షించండి అని బంజారా సమాజానికి పిలుపునిచ్చారు.
దురాశ, ఇతరుల వస్తువులు దొంగిలించడం, స్వార్థం మానుకోవాలని హితవు పలికారు. అజ్ఞానం పేదరికం మూఢనమ్మకాల నుండి విముక్తి పొంది ఉత్తమ జీవన విధానం వైపు పయనించాలని అన్నారు.
కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఈ మూడురోజుల ఉత్సవాలలో ప్రజలు వేల సంఖ్యలో పాల్గొంటారు.

