
పారిశుద్ధ్య కార్మికులకు వందనం
జై స్వచ్ఛ సేవక్ అంటూ నినాదం చేస్తూ.. సభికులతో స్వచ్ఛ సేవక్ లకు జై కొట్టించిన సీఎం చంద్రబాబు.
మన ఇల్లు, మన ఊరు, మన వీధులను నిరంతరం శుభ్రంగా ఉంచుతోన్న పారిశుద్ధ్య కార్మికులకు వందనం అని సీఎం చంద్రబాబు అన్నారు. అపరిశుభ్రతను తరిమేసే వాళ్లు నిజమైన వీరులు అంటూ వారికి కితాబిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం స్వచ్ఛత అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. జై స్వచ్ఛ సేవక్ అంటూ నినాదం చేస్తూ.. సభికులతో స్వచ్ఛ సేవక్ లకు జై కొట్టించారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా వీరులే. స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తోంది. కానీ గత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయింది. 85 లక్షల మెట్రిక్ టన్నుల మేర చెత్తను గత ప్రభుత్వం వదిలేసిపోయింది. తిరుమలను కూడా అపరిశుభ్రంగా మార్చారు. చెత్త పన్ను వేశారు.. చెత్తను వదిలేశారు. మేం చెత్త పన్నును రద్దు చేశాం... చెత్తననూ తొలగించాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. లెగసీ వేస్ట్ తొలగించిన మంత్రి నారాయణకు, మున్సిపల్ సిబ్బందికీ అభినందనలు తెలిపారు.