కలాంకు సలాం..ప్రముఖుల నివాళులు
x

కలాంకు సలాం..ప్రముఖుల నివాళులు

ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి నారా లోకేష్‌ కలాంకు నివాళులు అర్పించారు.


భారత దేశ అణు, శాస్త్రీయ రంగాలకు జీవం పోసిన ప్రముఖ శాస్త్రవేత్త, మానవతా వాది, భారతరత్న, మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి నారా లోకేష్‌ నివాళులు అర్పించారు. నిస్వార్థ సేవ, అంకిత భావం, దేశ భక్తిలకు ఆయన జీవితం నిజమైన అర్థాన్ని తెలియజేస్తుందని సీఎం చంద్రబాబు కలాంను కొనియాడితే, క్షిపణి శాస్త్రవేత్త, దార్శనికుడు, నిజమైన దేశ భక్తుడిగా మాజీ సీఎం జగన్‌ కీర్తించారు. ఆ మేరకు ఎక్స్‌ వేదికగా నివాళులు అర్పించారు.

చంద్రబాబు ఏమన్నారంటే..
శాస్త్రవేత్తగా దేశ అణు, శాస్త్రీయ రంగాలకు మార్గనిర్థేశం చేసిన దార్శనికుడు, ప్రజల రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం వర్థంతి సందర్భంగా ఆ మహోన్నత మానవతావాది సేవలను స్మరించుకుందాం.. అంటూ ట్వీట్‌ చేశారు.

జగన్‌ ఏమన్నారంటే..
భారత దేశ క్షిపణి శాస్త్రవేత్త, దార్శనికుడు, నిజమైన దేశభక్తుడు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం. ఆయన మాటలు దేశ యువతకు ఎంతో స్పూర్తిదాయకం. భారత దేశ పటిష్టత, అభివృద్ధి కోసం అబ్దుల్‌ కలాం ఎంతో కృషి చేశారు. కలాం వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

లోకేష్‌ ఏమన్నారంటే..
భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం వర్థంతి సందర్భంగా ఆయ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారతజాతి గర్వించదగ్గ గొప్ప మేధావి అబ్దుల్‌ కలాం. ‘మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుగడించారు. శాస్త్రవేత్తగా దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం. తనదైన వ్యక్తిత్వం, ప్రసంగాలతో లక్షలాది మందిలో స్పూర్తిని నింపారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం.. అంటూ ట్వీట్‌ చేశారు.


Read More
Next Story