సజ్జల మరో నాలుగు వారాలు సేఫే.. తర్వాత ?
x

సజ్జల మరో నాలుగు వారాలు సేఫే.. తర్వాత ?

సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఇప్పట్లో కఠిన చర్యలు తీసుకోవద్దు. నాలుగు వారాల పాటు ఆయన్నేమీ అనొద్దు హైకోర్టు ఆదేశాలు.


వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్టే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పావులు కదుపుతోంది. దానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నింటిని సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే టీడీపీ కార్యాలయాలపై దాడిని సీరియస్‌గా తీసుకుంది. అదే లెవల్లో పోలీసులకు కడా ఆదేశాలు జారీ చేసింది. దాడికి పాల్పడిన వారిని వెతికి పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌లకు తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాడులకు పాల్పడ్డారనే కారణాలతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను జైలుకు పంపేందుకు శరవేగంగా చర్యలు తీసుకుంది. స్థానిక పోలీసుల నుంచి ఈ కేసులను ప్రత్యేకించి సీఐడీకీకి బదలాయింపులు చేపట్టింది. ఇలా ఒక పక్క ఈ కేసుల విచారణలో వేగం పెంచుతూ.. మరో పక్క వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, శ్రేణుల మీద ప్రెషర్‌ పెంచే విధంగా ఎత్తుగడలు వేసింది. సజ్జల రామకృష్ణారెడ్డిపైన ఏకంగా ఎల్‌ఓసి నోటీసులను కూడా జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరవుతున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ముందస్తు బెయిళ్ల కోసం కోర్టులను ఆశ్రయించక తప్ప లేదు. అందులో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీలో కీలక నేతైన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు సజ్జల రామకృష్ణారెడ్డిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసి, ఎట్టి పరిస్థితుల్లో సజ్జలను అరెస్టు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ మీద మరో సారి హైకోర్టులో విచారణ జరిగింది. తనపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలున్నా.. తనపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారని, కోర్టు దిక్కరణ బాధ్యులను శిక్షించాలని కోరుతూ సజ్జల రామకృష్ణారెడ్డి మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. సజ్జల రతపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇది వరకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో నాలుగు వారాపాల పాటు పొడిగిందించి. మరో నాలుగు వారాలు సజ్జలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్, మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసింది. ఎల్‌ఓసి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. దీనికి సమయం కావాలని పోలీసుల తరపున వ్యాయవాది కోర్టును కోరారు.
Read More
Next Story