
రూ. 48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
రూ. 48,340 కోట్లతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయమే ఆధారమని మంత్రి చెప్పారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ. 13,487 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. డ్రోన్ల రాయితీ కోసం రూ. 80 కోట్లు, 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయం యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ కోసం రూ. 219 కోట్లు, విత్తన రాయితీ పంపిణీకి రూ. 240 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ. 250 కోట్లు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అమలు కోసం రూ. 9, 400 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం రూ. 1,023 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
టెక్నాలజీతో సాగు వ్యయాన్ని తగ్గించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్రాఉ. గత ప్రభుత్వం పెట్టిన రూ. 120 కోట్ల విత్తన రాయితీ బకాయిలను చెల్లించామన్నారు. 35.8లక్షల మెట్రిక్ టన్నుల ఎవురు సరఫరా చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామన్నారు. అర్హులైన కౌలు రైతులకు హక్కు పత్రాలను ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 11 పంటలను గ్రోత్ ఇంజన్లుగా ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సహానికి రూ. 61 కోట్లు, ఎరువుల నిర్వహణకు రూ. 40 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీలకు రూ. 139 కోట్లు కేటాయించామన్నారు.
Next Story