
గుంతకల్లు కలికి తురాయి ఈ సాయి సాకేత్!
ఏటా రూ.5 కోట్ల ప్యాకేజీ, అమెరికాలో ఇల్లు
గుంతకల్లు కుర్రాడు కొట్టేశాడు ఛాన్స్. ఏటా రూ.5 కోట్ల విలువైన ప్యాకేజీ, అమెరికాలో ఇల్లు.. ఇక ఈ కుర్రాడి దర్జాయే వేరనుకోండి. గుంతకల్లుకు చెందిన సాయిసాకేత్‌కు రూ.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో అమెరికాలోని ఆప్టివర్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. అసలు ఉద్యోగంలో చేరడానికి ముందు రెండున్నర నెలల పాటు ట్రైనింగ్ కి రమ్మని కబురు పంపింది. దీన్ని ఇంటర్న్‌షిప్ అంటారట. దీనికి రూ.కోటి వేతనం ఇస్తారు. కోర్సు పూర్తి కాగానే ఏడాదికి రూ.5 కోట్లు ప్యాకేజీ ఇవ్వడానికి ఆ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.
గుంతకల్లుకు చెందిన రమేశ్, వాసవి దంపతుల కుమారుడు సాయి సాకేత్. వీరు పదేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. వీరి కుమారుడు అమెరికాలోనే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే కొలువకు అర్హత సాధించారు.
సంస్థ పెట్టిన ఎంపిక పరీక్షల్లో సాఫ్ట్‌వేర్, బిజినెస్, గణితం విభాగాల్లో అత్యంత ప్రతిభను చూపినందుకు సంస్థ ఎంపిక చేసిందని సాయి సాకేత్‌ను ఎంపిక చేశారు.
సాయి సాకేత్ అద్భుత ప్రతిభావంతుడని, ఆయన మరింత ముందుకు వెళతారని అమెరికాలోని తెలుగు సంఘాల వారు ప్రశంసించారు.
Next Story