తుపాను షెల్టర్లలోని బాధితులకు రూ.3వేల నగదు
x
Cm Chandra babu reviewed with officials on cyclone

తుపాను షెల్టర్లలోని బాధితులకు రూ.3వేల నగదు

తుపాన్ల సమయంలో రోల్ మోడల్ గా ఉండాలని చంద్రబాబు ఆదేశం


ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకువస్తున్న మొంథా తుపానును దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొంథా తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు (Chandrababu) టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.
విశాఖపట్నంలో ప్రస్తుత పరిస్థితి ఇలా..
‘3 వేల నగదుతో పాటు కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేస్తారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు అవుతాయి. జిల్లాల్లో అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలి. భవిష్యత్‌లో వచ్చే తుపాన్లను ఎదుర్కొనే విధంగా ఈ కార్యాచరణ ఒక రోల్‌మోడల్‌గా ఉండాలి’ సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు సూచించారు.
‘పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జ్‌లను నియమించాలి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలి. ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి. ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలి. జిల్లాల్లో తుపాను రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదే. వాలంటీర్లుగా వచ్చే వారిని సహాయక కార్యక్రమాలకు వినియోగించుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగమంతా నిబద్ధతతో పనిచేసి మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మానవ ప్రయత్నంలో ఎలాంటి అలసత్వం కనిపించకూడదు’ అని సీఎం పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలను ఈ తుపాను తాకే ప్రమాదం ఉంది. 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేశారు. స్కూళ్లకు సెలవు ఇచ్చారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Read More
Next Story