రూ. 200లు నోట్లు రద్దు అవుతున్నాయా?
x

రూ. 200లు నోట్లు రద్దు అవుతున్నాయా?

దేశంలో రూ. 200లు, రూ. 500ల నకిలీ నోట్ల చెలామణి ఎక్కువైందని ఆర్బీఐ చెబుతోంది.


నకిలీ నోట్ల చెలామణి ఎక్కువవుతోంది. రూ. 500లు, రూ. 200లు నోట్లు ఎక్కువగా నకిలీవి వస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటన రిలీజ్ చేసింది. దీనిని అరికట్టేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించింది. గతంలో రూ. 2000లు నోట్లు తెచ్చి కొద్ది నెలల తరువాత వాటి ప్రింటింగ్ ను ఆపివేసింది. బ్లాక్ మనీ ఎక్కువ అవుతోందని, దానిని అరికట్టాలంటే రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రెండు వందల రూపాయల నోట్ల విషయం కూడా ఇలాగే తయారైంది. నకిలీ నోట్లు మార్కెట్ లోకి వచ్చినట్లు ఆర్బిఐ వెల్లడించింది. అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.

నకిలీ నోట్లు అరికట్టాలంటే రద్దు చేయక తప్పదా..

ప్రజల్లోకి నకిలీ రూ. 200ల నోట్లు వచ్చాయనే ప్రచారంతో వ్యాపారులు రెండు వందల రూపాయల నోట్లు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఎక్కడివి అక్కడ ఆగిపోతున్నాయి. దీని వల్ల సామాన్యులకు తప్ప పెట్టుబడి దారులకు ఎటువంటి ఇబ్బంది ఉండటం లేదు. ఎక్కువగా డిజిటల్ ట్రాన్షాక్షన్ వైపు బడా బాబులు వెళుతున్నారు. ఎటొచ్చీ సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ నోట్లు అరికట్టేది ఎపుడు? ఎలా అరికడతారనే విషయంపై ఆర్బీఐ క్లారిటీ ఇవ్వలేదు. కేవలం అరికడతామని మాత్రమే ప్రకటన ఇచ్చింది. ఒరిజినల్ నోటు ఎలా ఉంటుందనే విషయాన్ని తెలియజేసింది. ఇదంతా సాధారణంగా జరిగే పనే అయినా నకిలీవి అరికట్టడం అంత తేలికైన పనైతే కాదనేది పలువురు చెబుతున్న మాటలు. పోలీసులు అసలు మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుని వారిని అరెస్ట్ చేసే సరికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుందని, ఈలోపు నష్టపోయే వారు నష్టపోతూనే ఉంటారని పలువురు వ్యాపార వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

నకిలీ నోట్ అని ఎలా గుర్తించాలంటే..?

రూ. 200 రూపాయల నోటు నకిలీదో కాదో తెలుసుకోవడం ఎలా? దీన్ని తెలుసుకోవడానికి, మీరు దానిని ఎలా గుర్తించాలి. రూ. 200 రూపాయల నోటుకు ఎడమ వైపు దేవనాగరి లిపిలో 200 అని రాసి ఉంది. మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. అలాగే RBI, భారత్, ఇండియా, 200 చాలా చిన్న అక్షరాలతో అంటే మైక్రో ఫాంట్‌లో రాసి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. కుడి వైపున అశోక స్తంభం చిహ్నం ఉంటుందని తెలిపింది. నకిలీ నోట్ల వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. లావాదేవీల సమయంలో నోట్లను సరిగ్గా చెక్ చేసుకోవాలని సూచించింది. ఎవరైనా నకిలీ నోటును గుర్తించినట్లయితే, దానిని స్థానిక పరిపాలన లేదా సంబంధిత బ్యాంకు అధికారులకు వెంటనే తెలియజేయాలని RBI తెలిపింది.

రూ. 200ల నోట్లను ప్రభుత్వం రద్దు చేస్తుందా?

దేశంలో రూ. 200ల నకిలీ నోట్లు ఎక్కువయ్యాయని ఆర్బీఐ చెబుతోందంటే తప్పకుండా రద్దుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే భావించాల్సి ఉంటుంది. నకిలీ నోట్లు అరికట్టేందుకు పలానా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ చెప్పటం లేదు. నకిలీ నోట్లు ఉన్నాయని, అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రూ. 200లు జిరాక్స్ తీసి చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు దొంగ నోట్లను తయారు చేసే పనిలో ఉన్నారు. గతంలో రూ. 2000ల నోట్లను మాచర్ల పరిసర ప్రాంతాల్లో తయారు చేసి చెలామణి చేశారు. ఆ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ నోట్లు తయారు చేయడం మొదలు పెడితే వాటిని అరికట్టడం చాలా కష్టం. ఎందుకంటే అటువంటి కేటు గాళ్లు దాదాపు నిర్మానుష్య ప్రాంతాల్లో మిషన్ లు ఏర్పాటు చేసుకుని ప్రింటింగ్ చేస్తుంటారు. అనేక ప్రాంతాల నుంచి చెలామణి చేసే వారు వచ్చి వారి వద్ద లక్షకు పది వేలు సాధారణ ఒరిజినల్ నోట్లు ఇచ్చి కొనుక్కుని పోతుంటారు. అందువల్ల నకిలీ నోట్లు అరికట్టడం సాధ్యమయ్యే పనికాదని ప్రభుత్వానికి కూడా తెలుసు.

రద్దు చేసే యోచనలో ప్రభుత్వం

రెండు వందల రూపాయల నోట్లు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే రూ. 200ల నోట్లు దాదాపుగా బడా బాబుల నుంచి బ్యాంకులకు చేరినట్లు సమాచారం. ఎటొచ్చీ ఇబ్బంది పడేది సాధారణ ప్రజలేనని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. నోట్ల రద్దు, నకిలీ నోట్ల వ్యవహారం ఈ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువగా జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. నోట్లు రద్దు చేసేది లేదని ఆర్బీఐ చెబుతున్నా నకిలీ నోట్లు వస్తున్నాయని చెప్పటం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇప్పుడు చాలా మందిలో ప్రశ్నార్థకంగా మారింది.

Read More
Next Story