తురకపాలెంలో ఆర్‌ఎంపీ క్లీనిక్‌ సీజ్‌..ఎందుకంటే
x

తురకపాలెంలో ఆర్‌ఎంపీ క్లీనిక్‌ సీజ్‌..ఎందుకంటే

గత ఐదు నెలల్లో తురకపాలెంలో 28 మరణాలు సంభవించినట్లు అధికారులు ఇటీవల వెల్లడించారు.


తురకపాలెం మరణాలు యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ను ఓ కుదుపు కుదిపింది. వరుసగా తురకపాలెం గ్రామస్తులు మరణిస్తుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దీని మీద పలువురు వైద్య నిపుణుల బృందాలు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టారు. అయినా ఇప్పటికీ తురకపాలెం గ్రామస్తులలో ప్రాణభయం వీడలేదు. తెల్లవారితే ఎవరు చనిపోతారో, ఏ మరణ వార్త వినాల్సి వస్తోందో అని తీవ్రమైన భయాందోళనలతోనే బతుకీడుస్తున్నారు.

మరో వైపు తురకపాలెం అంతు చిక్కని మరణాల మిస్టరీని చేధించేందుకు అనేక ప్రయత్నాలు చేపట్టారు. అందులో భాగంగా అక్కడి స్థానిక ఆర్‌ఎంపీ క్లీనిక్‌ను సీజ్‌ చేశారు. వివిధ అనారోగ్య కారణాలతో మరణించిన వారిలో కొంత మంది తొలుత ఈ ఆర్‌ఎంపీ క్లీనిక్‌లోనే చికిత్సలు పొందినట్లు ఆధారాలతో అధికారులు తేల్చారు. మృత్యువాత పడిన వారికి ఈ ఆర్‌ఎంపీలో చికిత్సలు చేసే సమయంలో అధిర మోతాదులో యాంటీబయాటిక్స్‌ ఇచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా అధికంగా సెలైన్లు కూడా వాడారని, ఇలా అధికంగా సెలైన్లు వాడకం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్లకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి తురకపాలెంలోని ఆర్‌ఎంపీ క్లీనిక్‌ను గురువారం సీజ్‌ చేశారు. అంతేకాకుండా దీనిపైన విచారణ కూడా చేపట్టారు.
మరో వైపు గత కొద్ది రోజులుగా గుంటూరు రూరల్‌ మండలం పరిధిలోని తురకపాలెం గ్రామం ప్రాణభయంతో విలవిల్లాడి పోతోంది. వరుస మరణాలు ఆ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే 28 మందిని పొట్టన పెట్టుకున్న అంతు చిక్కని మహమ్మారికి ఇంకా ఎంత మంది ఇలా బలికావలసి వస్తుందో అని అల్లాడిపోతున్నారు. దీనికి శాశ్వతమైన పరిష్కారం ఎప్పు లభిస్తోందనని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Read More
Next Story