రేవంత్ కు ఫాలోయింగ్ తగ్గిపోయిందా ?
x

రేవంత్ కు ఫాలోయింగ్ తగ్గిపోయిందా ?

రేవంత్ చేసే పోస్టులకు సోషల్ మీడియాలో రీ పోస్టులు, రీ ట్వీట్లు చేయాలని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుమహేష్ కుమార్ గౌడ్ ఫుల్లుగా క్లాసు పీకారు.


ఏ రంగంలో ఉన్నవారిలో అయినా ప్రచారం కోరుకోని వారు ఎంతమంది ఉంటారు ? రాజకీయాలు, సెలబ్రిటీలు, మీడియా, వ్యాపార రంగాల్లో అయితే ప్రచారం అవసరాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. అందుకనే ప్రచారం కోసం ఎక్కడలేని పోటీ పెరిగిపోతోంది. ఈ పోటీలో భాగంగానే వ్యతిరేకులపై నెగిటివ్ ప్రచారం కూడా ట్రోలింగ్(Trolling) పెరిగిపోతోంది. ఇపుడిదంతా ఎందుకంటే రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి కూడా ప్రచారం కావాలట. రేవంత్ చేసే పోస్టులకు సోషల్ మీడియా(Social Media)లో రీ పోస్టులు(Re Posts) రీ ట్వీట్లు(Re Tweets) చేయాలని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు(TPCC President) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) నేతలు, కార్యకర్తలకు ఫుల్లుగా క్లాసు పీకారు. ఒకపుడు బాగా ఉన్న ఫాలోయింగ్ ఇపుడు తగ్గిపోయిందన్నారు. పార్టీ ఆఫీసు గాంధీభవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతు రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నపుడు సోషల్ మీడియాలో ప్రచారం బాగానే జరిగేదన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సోషల్ మీడియాలో ప్రచారం తగ్గిపోయిందని గుర్తుచేశారు.

ప్రచారం అన్నది సైకిల్ లాంటిదని నిత్యం జరుగుతునే ఉండాలన్నారు. ఇందుకు పార్టీలోని ప్రతిఒక్కరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ పోస్టు పెట్టగానే వెంటనే అందరు దాన్ని రీపోస్టు, ఫార్వార్డు చేయాల్సిందే అని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో అధికారిక ట్విట్టర్ ఖాతాలో రేవంత్ రెడ్డి 91 మందిని ఫాలో అవుతుండగా రేవంత్ ను 581 లక్షలమంది ఫాలో అవుతున్నారు. ఇన్ని లక్షలమంది ఫాలోయర్లు ఉన్న రేవంత్ పోస్టులకు ఇంకా రీ పోస్టులు కావాలని బొమ్మ అడగటమే విచిత్రంగా ఉంది. అంటే 581 లక్షల మంది ఫాలోయర్ల దగ్గరే రేవంత్ ఫాలోయింగ్ ఆగిపోవాలని ఏమీలేదు. ఎంతమంది ఫాలోయర్లుంటే అంత ప్రముఖులుగా లెక్క ప్రస్తుత కాలంలో.

రేవంత్ తో పాటు తాను, కాంగ్రెస్ పార్టీ, పార్టీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ఇలా ఎవరు పోస్టులు పెట్టినా వెంటనే అందరు రీ పోస్టులు, ఫార్వార్డులు చేయాలని మహేష్ గట్టిగా చెప్పారు. మహేష్ మాటలు వింటుంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ వెనకబడిపోయిందన్న ఆందోళన కనబడుతోంది. రేవంత్ కు ఫాలోయింగ్ ఎందుకు తగ్గిందనే విషయాన్ని అందరు ఆలోచించాలని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

Read More
Next Story