Revanth and Kingfisher|‘కింగ్ ఫిషర్’పై రేవంత్ ప్రభుత్వం దెబ్బ ?
x

Revanth and Kingfisher|‘కింగ్ ఫిషర్’పై రేవంత్ ప్రభుత్వం దెబ్బ ?

కమీషన్ల పెంచాలన్న కింగ్ పిషర్(Kingfisher Beer) డిమాండు ప్రభుత్వం లొంగలేదు సరికదా కంపెనీ మోనోపలీని దెబ్బకొట్టాలని డిసైడ్ చేసినట్లు ప్రభుత్వవర్గాల సమాచారం.


రేవంత్ రెడ్డి ప్రభుత్వందెబ్బ కింగ్ ఫిషర్ మీద పడేట్లే కనబడుతోంది. కమీషన్ల పెంచాలన్న కింగ్ పిషర్(Kingfisher Beer) డిమాండు ప్రభుత్వం లొంగలేదు సరికదా కంపెనీ మోనోపలీని దెబ్బకొట్టాలని డిసైడ్ చేసినట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. ఇపుడు బీర్ల మార్కెట్లో(Beer Market) కింగ్ ఫిషర్ ది తిరుగులేని ఆధిపత్యం. మార్కెట్లో కింగ్ ఫిషర్ తో పాటు చార్ల్స్ బర్గ్, కార్ల్స్ బర్గ్, రాయల్ చాలెంజ్(Royal Challenge), బడ్ వైజర్(Bud Wiser) లాంటి సుమారు 30 రకాలబీర్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఇన్నిరకాల బీర్లు అందుబాటులో ఉన్నా కింగ్ ఫిషర్ షేర్ మాత్రం ఓ రేంజిలో ఉంటోంది. మొత్తం బీర్ల మార్కెట్లో కింగ్ ఫిషర్ షేర్ సుమారు 70 శాతం ఉంది. ఉదాహరణకు అమ్ముడుపోయే ప్రతివందబీర్లలో 70బీర్లు యునైటెడ్ బ్రూవరీస్(UB) తయారుచేస్తున్న కింగ్ ఫిషరే ఉంది. బీర్ల మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం ఉంది కాబట్టే ఎప్పుడుసమస్య వచ్చినా యునైటెడ్ బ్రూవరీస్ నుండే వస్తోంది.

అందుకనే యునైటెడ్ బ్రూవరీస్(యూబీ) తయారుచేస్తున్న కింగ్ ఫిషర్ బీర్ల మార్కెట్ ను నియంత్రించాలని రేవంత్ రెడ్డి(Revanth reddy Govt) ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. మోనోపలీ ఉంది కాబట్టే యూబీ కంపెనీ ప్రతిసారి బీర్ల సరఫరాను నిలిపేస్తానని బెదిరిస్తోంది. కింగ్ ఫిషర్ బీర్లు మార్కెట్లో దొరక్కపోతే బీర్లప్రియులు అల్లాడిపోతారు, ప్రభుత్వంమీద బాగా ఒత్తిడి పెంచేస్తారని యూబీ కంపెనీ భావిస్తోంది. యూబీ కంపెనీ ఈ విధంగా ఆలోచించటానికి కారణం గత ప్రభుత్వాల వైఖరే. గత ప్రభుత్వాలు మిగిలిన బీర్ల ఉత్పత్తి కంపెనీలకు కాస్త అటు ఇటుగా సరఫరా బాధ్యతలు అప్పగించుంటే మార్కెట్లో ఈరోజున కింగ్ ఫిషర్ మోనోపలీ ఈస్ధాయిలో ఉండేదికాదు. బీర్ల సరఫారాను నిలిపేస్తానని యూబీ కంపెనీ ప్రభుత్వాన్ని బెదిరించేంత సీనుండేది కాదు.

ఇపుడు తెలంగాణాలో 30 కంపెనీలు తయారుచేస్తున్న బీర్లు రోజుకు సుమారు 15 లక్షల బాటిళ్ళు అమ్ముడుబోతున్నాయి. ఈ 15 లక్షల బీర్లలో సుమారుగా యూబీ కంపెనీ షేరే దాదాపు 11 లక్షల బాటిళ్ళు. అందుకనే ప్రతి విషయంలోను యూబీ కంపెనీ తన డిమాండును సాధించుకునేందుకు కొండెక్కి కూర్చుంటోంది. అదే బీర్ల సరఫరాలో యూబీ కంపెనీకి ఎక్కువ ఆర్డర్ ఇవ్వకుండా మిగిలిన కంపెనీలను కూడా ప్రోత్సహించుంటే ఇపుడు ప్రభుత్వాన్ని యూబీ కంపెనీ సరఫరా నిలిపేస్తామని బెదిరించే అవకాశం ఉండేదికాదు. మార్కెట్లో కింగ్ ఫిషర్ బీర్ కాకపోతే మరో కంపెనీ బీరు దొరుకుతుంది. కింగ్ ఫిషర్ బీర్లను జనాలు బాగా ఇష్టపడతారనటంలో సందేహంలేదు. ఎందుకంటే మార్కెట్లో ఎక్కడచూసినా కింగ్ ఫిషర్ బీర్లే కనబడుతున్నాయి కాబట్టి జనాలు వాటినే తాగుతున్నారు, వాటికే అలవాటుపడ్డారు. కొద్దిరోజులు కింగ్ ఫిషర్ బీర్ ఆగిపోయి మార్కెట్లో ఏది దొరికితే బీరుప్రియులు దానినే తీసుకుంటారు, దానికే అలవాటు పడతారు.

రోజు బీర్లు తాగేవాళ్ళకు ఏ బీరైతే ఏమిటి ? కింగ్ ఫిషరా ? బడ్ వైజరా ? లేకపోతే రాయల్ చాలెంజా ? కింగ్ ఫిషర్ లేకపోతే ఇంకో బీరు తాగనని బీరుప్రియుడు భీష్మించుకుని కూర్చోడన్నది వాస్తవం. కింగ్ ఫిషర్ బీరు ఇక దొరకదని అనుకున్నపుడు వెంటనే ఏదో కంపెనీ బీరుకు అలవాటుపడతాడు. ఏది అవైలబులిటీ ఉంటే దాన్నే తాగుతాడు. ఇపుడు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నట్లు యూబీ కంపెనీ కింగ్ ఫిషర్ బీర్ సరఫరాను ఆపేస్తే నష్టపోయేది కంపెనీయే కాని ప్రభుత్వం కాదు జనాలూ కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేరుకుపోయిన బకాయిల చెల్లింపు సమయంలో కూడా బీర్ల సరఫరాను నిలిపేస్తానని యూబీ కంపెనీ బెదిరించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఏదోలా సమస్య సర్దుబాటయినా మళ్ళీ ఇపుడు కమీషన్ పెంచే విషయంలో సమస్య మొదలైంది. తమకు ఇస్తున్న 33 శాతం కమీషన్ను పెంచాలని యూబీ కంపెనీ డిమాండ్ చేస్తోంది.

కంపెనీ అడిగినట్లు కమీషన్ పెంచటం సాధ్యంకాదని ప్రభుత్వం భావిస్తోంది. పైగా కమీషన్ రివైజ్ చేసే విషయమై నియమించిన రిటైర్డ్ జడ్జి కమిటి ఇంకా రిపోర్టును ఇవ్వలేదు. ఆ రిపోర్టు రాగానే సమావేశం పెట్టి నిర్ణయం తీసుకోవాలన్నది రేవంత్ ఆలోచన. అయితే అంతవరకు యూబీ కంపెనీ ఆగటంలేదు. సమస్యంతా ప్రభుత్వానికి కంపెనీకి ఇక్కడేవస్తోంది. అందుకనే బీర్లమార్కెట్ లో తిరుగులేకుండా ఉన్న కింగ్ పిషర్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలని రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మార్కెట్లో మోనోపలీ లేకపోతే బెదిరింపులు ఉండవు. కాబట్టి మిగిలిన కంపెనీల ఉత్పత్తిసామర్ధ్యంపై చర్చలుజరిపి పెంచుకునే అవకాశం ఉంటే ఉత్పత్తి పెంచుకునేందుకు మిగిలిన కంపెనీలకు అవకాశాలు ఇచ్చేట్లుగా మాట్లాడమని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను రేవంత్ ఆదేశించినట్లు తెలిసింది. ఇదేజరిగితే కింగ్ ఫిషర్ మోనోపలీని దెబ్బకొట్టినట్లే అవుతుంది.

తొందరలోనే సమస్య పరిష్కారం.

ఇదేవిషయమై వైన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దళపతిరావు వెంకటేశ్వరరావు ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు ‘కమీషన్ విషయమై యూబీకంపెనీతో మొదలైనసమస్య వీలైనంత తొందరగా పరిష్కారమవుతుంద’ని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ‘మార్కెట్లో ఏ బీరు అందుబాటులో ఉంటే జనాలు దానికే అలవాటు పడిపడతార’ని చెప్పారు. ‘ఒకే కంపెనీకి మోనోపలీగా ఎదిగేందుకు అవకాశం ఇవ్వకుండా మిగిలిన కంపెనీలను కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంద’ని అభిప్రాయపడ్డారు. ‘బయటరాష్ట్రాల నుండి కంపెనీలను తెప్పించి బీర్లు ఉత్పత్తిచేయించటం అంత సులభంకాద’న్నారు. బీఆర్ఎస్ హయాంలో పేరుకుపోయిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లిగా క్లియర్ చేస్తున్నట్లు చెప్పారు. ‘కమీషన్లు రివైజ్ చేసే విషయంలో ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ జడ్జి కమిటి ఇంకా తయారీదారులతో చర్చలు జరపలేద’ని దళపతిరావు చెప్పారు.

‘కొన్నిరాష్ట్రాల్లో ఎక్సైజ్ పన్నులు తక్కువగా ఉందికాబట్టి తెలంగాణాలో కూడా తమకు కమీషన్ పెంచాలని యూబీ కంపెనీ పట్టుబడుతున్న’ట్లు చెప్పారు. ‘కమీషన్ పెంచమని అడగటంలో కంపెనీ తప్పేమీలేదని 2019 నుండి కమీషన్ పెంచలేద’ని చెప్పారు. అందుకనే ఇపుడు కమీషన్ పెంచమని యూబీకంపెనీ డిమాండ్ చేస్తోందన్నారు. కంపెనీ అడిగినట్లుగా కమీషన్ పెంచితే బీర్ ధరను ప్రభుత్వం పెంచక తప్పదన్నారు. బీర్ ధర పెరిగితే జనాల మీద భారం పడుతుందన్నారు. అందుకనే ఈ సమస్యను పరిష్కరించేందుకు రేవంత్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు దళపతిరావు చెప్పారు.

Read More
Next Story